Thursday, March 26, 2026
HomeతెలంగాణBandi Sanjay | పేదలకు నమ్మకం తగ్గిపోతుంది

Bandi Sanjay | పేదలకు నమ్మకం తగ్గిపోతుంది

  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేవు
  • వసతుల కల్పనకు కేంద్రం చర్యలు
  • సక్రమంగా వినియోగించుకోని రాష్ట్రప్రభుత్వం
  • జమ్మికుంటలో ఆధునిక వైద్య పరికరాలు ప్రారంభించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

పేద ప్రజలు అత్యవసర చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులను విశ్వసించి వస్తారని, ఆ నమ్మకాన్ని పెంపొందించే దిశలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ అవకాశాలను సక్రమంగా వినియోగించుకోలేక పోతుందని ఆయన విమర్శించారు. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోటి యాభై లక్షల రూపాయల సిఎస్సార్ నిధులతో కొనుగోలు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల బలోపేతంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌక ర్యాలు లేక పేదలకు నమ్మకం తగ్గిపోతున్నదని, ఈ పరిస్థితిని మార్చడానికి కేంద్రం కట్టుబడి ఉం దని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇప్పటివరకు సిఎస్సార్ నిధుల ద్వారా ఐదు కోట్ల రూపాయలు అందజేసి ఆధునిక పరికరాలను తీసుకురావడంలో విజయవంతమయ్యామని చెప్పారు. ఆసుపత్రిలో పోస్టుమార్టం రూమ్, ఎక్స్రే మిషన్తో పాటు అవసరమైన ఇతర పరికరాలను ఎంపీ నిధుల ద్వారా త్వరలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు. పరికరాల లేమి పేరుతో పేద రోగులను కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేయొద్దని వైద్యులకు సూచించారు.

- Advertisement -

సేవా దృక్పథంతో పనిచేస్తే ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై మంచి విశ్వాసం ఏర్పడుతుందని అన్నారు. రాష్ట్రంలోని చెక్ డ్యాంల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని బండి సంజయ్ ఆరోపిం చారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల వద్ద నుంచి కమీషన్లు తీసుకుందని, ప్రణాళిక లేకుండా చెక్ డ్యాంలను నిర్మించారని పేర్కొన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టర్లు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నారని అన్నారు. చెక్ డ్యాంలపై విచారణ జరిపించి అవినీతి నిర్ధారణ అయితే కాంట్రాక్టర్ల నుంచి నిధులు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. జమ్మికుంట రైల్వే స్టేషను పూర్తిగా ఆధునీకరించేందుకు త్వరలో ప్రపోజల్స్ పంపుతామని, జమ్మికుంటలో స్టేడియం నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తామని బండి సంజయ్ ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News