Saturday, March 14, 2026
Homeక్రైమ్ వార్తలుComplaint On Mla | ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఫిర్యాదు

Complaint On Mla | ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఫిర్యాదు

కమ్యూనిటీ హాల్ పేరిట గెస్ట్ హౌజ్ నిర్మాణమా?
వెంటనే స్వాధీనం చేసుకోవాలి
హైదరాబాద్ కలెక్టర్‌కు ఆనంద్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి
ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్

కమ్యూనిటీ హాల్ (Community Hall) పేరుతో గెస్ట్ హౌజ్ (Guest House) నిర్మించుకొని, అందులో జిమ్(Gym) ఏర్పాటుచేసుకొని ప్రజాధనాన్ని (Public money) దుర్వినియోగం చేశారంటూ గోషామహల్ ఎమ్మెల్యే (Goshamahal MLA) రాజాసింగ్‌(Rajasingh)పై ఫిర్యాదు వచ్చింది. తప్పు చేసిన ఆయన నియోజకవర్గ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ నేత (Brs party leader) ఎం.ఆనంద్ కుమార్ గౌడ్ (Anand kumar goud) డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ కలెక్టర్ (Hyderabad Collector) దాసరి హరిచందన(Dasari Harichandana)ను కలిసి ఆధారాలతో కూడిన వినతిపత్రం సమర్పించారు.

- Advertisement -

‘బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసమని 2018 సెప్టెంబర్ 16న రూ.50 లక్షలు, అక్టోబర్ 1న రూ.55 లక్షలు, 2021 డిసెంబర్ 22న రూ.65 లక్షల నిధులు మంజూరు చేయించుకున్నారు. దూల్‌పేట్‌లోని ఆకాశపూరి, హనుమాన్ మందిర్ వద్ద విలాసవంతమైన గెస్ట్ హౌజ్, బెడ్ రూమ్, కాన్ఫరెన్స్ హాల్ నిర్మించుకున్నారు. 2023 మార్చి 23న రూ.20 లక్షలు, సెప్టెంబర్ 11న రూ.7.5 లక్షలతో జిమ్ ఏర్పాటుచేయించుకున్నారు’ అని ఆనంద్ కుమార్ గౌడ్ జిల్లా కలెక్టర్‌కు వివరించారు. దీనిపై విచారణ జరిపి గెస్ట్ హౌజ్‌ను స్వాధీనం చేసుకొని ప్రజల సౌకర్యార్థం వినియోగించేలా చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. సుమారు రూ.2 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్.. ఈ నిర్మాణాలను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు. స్థానికుల కోసం, శుభకార్యాల నిమిత్తం వాడుకునేలా కమ్యూనిటీ హాల్ బోర్డు పెట్టాలని అన్నారు. రాజాసింగ్‌కి సహకరించిన అధికారి, కాంట్రాక్టర్లపై చట్టరీత్యా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరే‌ట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News