ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న ఇందిరా మహిళా శక్తి చీరల(Indira Mahila Shakti sarees)ను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే (Ibrahimpatnam MLA) మల్‌రెడ్డి రంగారెడ్డి (Malreddy Ranga Reddy) పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళా సంక్షేమమే (Women Welfare) కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Government) ధ్యేయమని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్ గౌడ్, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ ఛైర్మన్ భాస్కరాచారి, తహశీల్దార్ సుదర్శన్ రెడ్డి, ఎంపీడీఓ (MPDO) శ్రీవాణి, మాజీ జెడ్పీటీసీ (ZPTC) దేవదాస్ గౌడ్, మండల మాజీ కో-ఆప్షన్ గౌస్ పాషా, మాజీ ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, సెర్ప్ పీడీ లీలాకుమారి, వివిధ శాఖల అధికారులు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
