Tuesday, March 24, 2026
Homeవరంగల్‌Urea Shortage | రబీలో యూరియా రందే…..

Urea Shortage | రబీలో యూరియా రందే…..

  • అయినా కొనసాగుతున్న డీలర్ల దందా…
  • మక్క సాగు పైనే రైతులకు మక్కువ ఎక్కువ…
  • యూరియా కొరతతో కుమిలిపోతున్న మక్క రైతులు

అసలే వానకాలం వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి పంటలు వానర్పణం అయ్యాయి. యాసంగి రబిలోనైనా రంది లేకుండా పంటలు పండించుకుని కాలం వెళ్ల తీద్దామనుకున్న రైతులకు ఆదిలోనే హంసపాదు మాదిరిగా యూరియా కొరత ఏర్పడడంతో తలలు పట్టుకుంటున్నారు. నర్సంపేట డివిజన్లోని నర్సంపేట, దుగ్గొండి, చెన్నారావుపేట, నెక్కొండ, ఖానాపురం, నల్లబెల్లి మండలాలలో వాన కాలంలో సుమారు 35 వేల ఎకరాల వరకు మొక్కజొన్న సాగు సాగింది. మిగతా ఒక లక్ష ఎకరాల్లో వరి పత్తి మిర్చి పంటలు సాగు కాగా వానదేవుడు చూపించిన ప్రతాపంతో అన్ని పంటలు దిగుబడి తగ్గి రైతులను నట్టేట ముంచాయి.

దీనికి తోడు గత వానకాలం సీజన్లో యూరియా బస్తా కావాలంటే కొట్టుకోవాల్సిందే అన్న మాదిరిగా తయారైంది. యూరియా కొరత వాళ్ల సైతం దిగుబడి గణనీయంగా తగ్గిపోయిందని రైతులు దిగులు చెందుతున్నారు. దిగులు దిగులుగానే మిగిలిపోతున్న తరుణంలో రవి సీజన్ కు సిద్ధమైన రైతులకు ఆదిలోనే యూరియా కొరత స్పష్టంగా కనబడుతున్నడంతో పంటలు సాగుచేయాల వద్ద అనే మీమాంసంలో పడిపోతున్నారు.

- Advertisement -

కొనసాగుతున్న డీలర్ల దందా

ముల్గే నక్క పైన తాటిపండు పడ్డ చందంగా రైతుల దినస్థితిలో ఉన్నప్పటికీ డీలర్ల దందా మాత్రం ఎక్కడ ఆగకుండా పోతుంది. వరంగల్లో యూరియా దిగుమతి కోసం రైల్వే ట్రాక్ మరమ్మతులు ఉన్నందున కరీంనగర్ నుంచి తెచ్చుకోవాల్సి వస్తుందని నెపంతో 267 రూపాయలకు రావలసిన యూరియా బస్తా అదనపు ట్రాన్స్పోర్ట్ మేమెందుకు భరిస్తామంటూ 350 నుంచి 400 కు ఒక్క యూరియా బస్తాలు విక్రయిస్తున్నప్పటికీ రైతులు అమాయకత్వం తో కొనుగోలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. లేదంటే లింకులు పెట్టి మరి ఇతర కలుపు మందులు లేదంటే ఇంకా పెద్ద మందులు కొనాలని పట్టుబడుతున్నప్పటికీ రైతులు సంబంధిత వ్యవసాయ శాఖకు ఫిర్యాదు చేస్తే మీ మాట ఏంది మేము వినేది ట్రాన్స్పోర్ట్ మీరు భరిస్తారా అంటూ వ్యవసాయ శాఖ అధికారులకు డీలర్లు ఎదురు తిరిగి సమాధానం చెబుతున్నట్లు అధికారులు సైతం వాపోతూ ఉండడం విశేషం.

నర్సంపేటకు 30 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం::: ఏడిఏ దామోదర్ రెడ్డి

గత వానకాలం సీజన్ కంటే డబుల్ రేట్లలో మొక్కజొన్న సాగు అవుతుందని సుమారు నర్సంపేట డివిజన్లో 70,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరుగుతున్న నేపథ్యంలో 30 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని ప్రభుత్వానికి నివేదించామని వరంగల్లో యూరియా దిగుమతి రైల్వే ట్రాక్ మరమ్మతులు జరుగుతున్న దృష్ట్యా త్వరలో మరమతులు కాగానే నర్సంపేటకు 30 వేల మెట్టుకు యూరియా రైతులకు అందిస్తామని ప్రైవేటు డీలర్ల దందా కు బలికాకుండా ప్రతి రైతు జాగ్రత్త పడాలని నర్సంపేట వ్యవసాయ శాఖ ఏడిఏ దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News