Sunday, February 22, 2026
Homeవరంగల్‌ఎందుకు ఏమిటి ఎలా అనే దృక్పథంతో శాస్త్రీయంగా శోధన చేయాలి

ఎందుకు ఏమిటి ఎలా అనే దృక్పథంతో శాస్త్రీయంగా శోధన చేయాలి

  • ఎంఈఓ సారయ్య

నర్సంపేట: జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ సంబరాలు 2025 నర్సంపేట మండల స్థాయిలో స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు. నర్సంపేట జీవీవి ప్రధాన కార్యదర్శి బూర్గు నవీన్ అధ్యక్షతన జరిగిన మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల బహుమతి ప్రధానోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మండల విద్యాధికారి కే సారయ్య మాట్లాడుతూ, విద్యార్థులు పట్టుదలతో చదువుకొని శాస్త్రీయ అవగాహనను కలిగి ఉండి నిత్యజీవితంలో సైన్స్ ను అనువదించుకుంటూ ఆలోచించుకుంటూ ఎందుకు ఏమిటి ఎలా అన్న ఆలోచన దృక్పథంతో ముందుకు సాగి భారతదేశానికి నోబెల్ ప్రైసెస్ తీసుకొని రావాలని ఆ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతదేశం శాస్త్ర విజ్ఞానంలో ముందుండాలని నోబెల్ ప్రైసెస్ను సాధించాలన్న లక్ష్యంతో విద్యార్థులు చిన్ననాటి నుండే సైన్స్ పట్ల ఇష్టాన్ని ఏర్పరచుకొని అధ్యయనం చేయాలని, ప్రయోగాల పట్ల మక్కువ చూపాలని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం జన విజ్ఞాన వేదిక ఎంతో శ్రమకోర్చి రాష్ట్ర వ్యాప్తంగా చెకుముకి సైన్స్ సంబరాలను డాక్టర్ సివి రామన్ జన్మదినోత్సవం రోజున ప్రారంభించి పాఠశాల స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తూ చిన్నారు విద్యార్థిని విద్యార్థులలో శాస్త్రీయ అవగాహన కలిగిస్తున్నారని జన విజ్ఞాన వేదికను అభినందించారు.

- Advertisement -

నర్సంపేట మండలంలో 28 పాఠశాలల నుంచి విద్యార్థులు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ రామకృష్ణ మాట్లాడుతూ, సమాజంలోని మూఢనమ్మకాలను రూపుమాపి ప్రజలలో శాస్త్రీయ చైతన్యాన్ని కలిగించడానికి జన విజ్ఞాన చేస్తున్న కృషి చాలా గొప్పదని విద్యార్థులు రాతియుగం నుండి నేటి రాకెట్యుగం వరకు సైన్స్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో సైన్సు పరిశోధనా ఫలితాలు ఏ విధంగా సమాజానికి అందాయో అవగాహన చేసుకుని ముందుకు సాగాలని భావి భారత శాస్త్రజ్ఞులుగా ఎదగాలని అన్నారు.

తదనంతరం మండల స్థాయిలో ప్రధమ ద్వితీయగా నిలిచిన పాఠశాలల విద్యార్థులకు బహుమతులను సర్టిఫికెట్స్ ను ఎంఈఓ చేతుల మీదుగా అందించారు. ఈ సంబరాలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులను పద్మావతి కిరాణం అధినేత శ్రీరాముల పోశెట్టి అందించారు. ఈ కార్యక్రమంలో జెవివి బాధ్యులు బూరుగు నవీన్, చెకుముకి జిల్లా కన్వీనర్ ఎండి రాయబోస్, చెకుముకి రిసోర్స్ పర్సన్స్ ఈ చంద్రశేఖర్, అర్జున్ సాగర్, బుచ్చి రాములు, ఉమామహేశ్వర్, రమేష్, రాజేశ్వరి, నందగోపాల్, వివిధ పాఠశాలల చెకుముకి గైడ్ టీచర్స్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News