యాక్షన్ కింగ్ (Action King) అర్జున్ (Arjun) సర్జ, ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) పోలీస్ ఇన్వెస్టిగేటివ్ పర్సనల్ డ్రామా (Police Investigative Personal Drama) “తీయవర్ కులై నడుంగ”. తెలుగులో “మఫ్టీ పోలీస్”(Mufti Police)గా ఈ నెల 21న (నేడు) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దినేష్ లక్ష్మణన్ దర్శకత్వంలో జీఎస్‌ఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై జి.అరుల్ కుమార్ నిర్మించిన ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో “మఫ్టీ పోలీస్” పేరుతో ప్రముఖ నిర్మాత ఏఎన్ బాలాజీ (A.N.Balaji) శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు.
డిస్ట్రిబ్యూటర్‌గా 400 పైచిలుకు చిత్రాలు
డిస్ట్రిబ్యూటర్‌గా 400 పైచిలుకు చిత్రాలు పంపిణీ చేసి, నిర్మాతగా “రంగం-2, యుద్ధభూమి, ఒరేయ్ బామ్మర్ది, డాక్టర్ 56, మై డియర్ భూతం వంటి చిత్రాలను అందించిన బాలాజీ.. “మఫ్టీ పోలీస్” చిత్రం నిర్మాతగా తన స్థాయిని మరింత పెంచుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. రచయిత హత్య నేపథ్యంలో పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అమితంగా అలరిస్తుందని బాలాజీ పేర్కొన్నారు. ఇటీవలికాలంలో పిల్లల పాలిట భూతంలా మారిన ఆటిజం వ్యాధి గురించి కూడా ఇందులో చర్చించామని చెప్పారు. ఆ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నంచేయడం ఈ చిత్రం ప్రత్యేకతని తెలిపారు.
‘భాగ్యం’ క్రేజ్
యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్(అలియాస్ భాగ్యం)కు తెలుగులో ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని అత్యధిక థియేటర్లలో “మఫ్టీ పోలీస్”ను విడుదల చేస్తున్నామని వెల్లడించారు. ఈ సినిమాలో యాక్షన్‌తోపాటు పర్సనల్ డ్రామా కూడా ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు. తమిళంతోపాటు తెలుగులోనూ అసాధారణ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని ఆశాభావం వెలిబుచ్చారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించే అవకాశం కల్పించిన జి.అరుల్ కుమార్‌కి, చిత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు దినేష్ లక్ష్మణన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
