Thursday, February 26, 2026
Homeక్రైమ్ వార్తలుMu*d*r | దినేష్ హ@త్య కేసులో ఆరుగురు వ్యక్తులు అరెస్ట్

Mu*d*r | దినేష్ హ@త్య కేసులో ఆరుగురు వ్యక్తులు అరెస్ట్

కరీంనగర్ జిల్లా, కొత్తపల్లి మండలం, మల్కాపూర్ గ్రామానికి చెందిన కవ్వంపల్లి దినేష్ (40) అనుమానాస్పద హ**త్య కేసును చొప్పదండి పోలీసులు ఛేధించారు. ఈ హ**త్య భూ తగాదాలు , వ్యక్తిగత కక్షల నేపథ్యంలో పథకం ప్రకారం జరిగినట్లు, హ*త్య చేసిన ఆరుగురు ప్రధాన నిందుతులైన కొత్తపల్లి మండలం మల్కాపూర్ కు చెందిన దేవునూరి శ్రావణ్ (28),దేవునూరి రాకేష్ (24),జంగం చిన్నారెడ్డి (25)దేవునూరి సంతోష్ (28)రామడుగు మండలం మోతె గ్రామానికి చెందిన కుమ్మరి వికేష్ (26) అనే వ్యక్తులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.


మల్కాపూర్ గ్రామానికి చెందిన నిందితుడు దేవునూరి సతీష్‌కు, మృతుడు కవ్వంపల్లి దినేష్‌కు మధ్య భూమి అమ్మకం విషయంలో కమీషన్ గొడవలు ఉన్నాయి. అలాగే, దినేష్ మరో నిందితుడు దేవునూరి సంతోష్‌ను, ఒక మహిళతో సన్నిహితంగా ఉంటున్న విషయంపై చంపుతానని పలుమార్లు బెదిరించాడు. దీంతో సంతోష్ తన అన్న దేవునూరి శ్రావణ్‌కు విషయం చెప్పగా, దినేష్ వలన తమ ఇద్దరికీ ముప్పు ఉందని భావించి, దినేష్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు.

- Advertisement -

గత ఏడాది పిబ్రవరి 25 న దేవునూరి శ్రావణ్ వాళ్ళ వదిన చనిపోవడంతో, అక్కడికి వచ్చిన దినేష్‌ను మట్టుబెట్టాలని నిందితులు పథకం పన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం నిందితులు కరీంనగర్ నుండి ఒక ఎర్టిగా కారును (ఏపీ 09 సీటి 3007) కిరాయికి తీసుకువచ్చారు. అదే రోజు సాయంత్రం దేవునూరి సతీష్, దినేష్‌ను మద్యం తాగించడానికి తన యమహా బైక్ (టి ఎస్ 02 ఎఫ్ ఈ 7785) పై కరీంనగర్ తీసుకెళ్లాడు. అనంతరం మద్యం సేవించిన తర్వాత ముందస్తు ప్రణాళిక ప్రకారం మల్కాపూర్ కెనాల్ వద్దకు దినేష్‌ను తీసుకొచ్చి, మిగతా నిందితులతో కలిసి దినేష్‌ను చితకబాదారు.

అక్కడి నుండి కారులో ఎక్కించుకొని జగిత్యాల వైపు వెళ్తూ, నూకపల్లి గ్రామ శివారులో కారును ఆపి, సతీష్ నల్లని తాడుతో దినేష్ మెడకు బిగించి హ**త్య చేసే ప్రయత్నం చేసాడు. అనంతరం అందరూ కలిసి దినేష్ కాళ్లు, చేతులు తాళ్లతో కట్టి చొప్పదండి శివారులోని కెనాల్‌లో పడేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు చొప్పదండి సి.ఐ సిబ్బంది మల్కాపూర్ గ్రామంలోని దేవునూరి శ్రావణ్ ఇంటి వద్ద దాడి చేసి, అక్కడ ఉన్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. వారి నుండి హ**త్యకు ఉపయోగించిన కారు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును సీపీ గౌష్ ఆలం ఆదేశాల మేరకు రూరల్ ఏసీపీ విజయకుమార్ ఆధ్వర్యంలో ఈ కేసు చేదించుటలో కృషి చేసిన చొప్పదండి ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, కొత్తపల్లి ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్, ఎస్సై లు నరేష్ రెడ్డి (చొప్పదండి), వంశీకృష్ణ,(గంగాధర) రాజు (రామడుగు), సాంబమూర్తి (కొత్తపల్లి) వారి సిబ్బందిని పోలీసు కమీషనర్ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News