Saturday, February 28, 2026
HomeజాతీయంPM Kisan | రైతులకు గుడ్ న్యూస్

PM Kisan | రైతులకు గుడ్ న్యూస్

  • పీఎం కిసాన్ నిధులు విడుదల
  • 21వ విడత నిధులను విడుదల చేసిన ప్రధాని
  • దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమ కానున్న రూ.18వేల కోట్లకు పైగా నిధులు

రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం- కిసాన్ నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం కింద 21వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లకు పైగా నిధులు జమకానున్నాయి.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. పీఎం కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా కోట్లాది రైతు కుటుంబాలకు లబ్ది చేకూరుతోంది. ఇప్పటి వరకు 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. భూమి వివరాలు పీఎం కిసాన్ పోర్టల్లో నమోదై ఉండి, బ్యాంకు ఖాతా ఆధార్ లింక్ అయి ఉన్న రైతులకు పథకం ప్రయోజనాలు అందుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News