Friday, March 6, 2026
HomeఫోటోలుTrailer Release | ‘ప్రేమంటే' ట్రైలర్ రిలీజ్

Trailer Release | ‘ప్రేమంటే’ ట్రైలర్ రిలీజ్

ప్రియదర్శి (Priyadarshi) రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే (Premante) ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది (Anandi) హీరోయిన్‌గా నటిస్తోంది. సుమ కనకాల (Suma Kanakala) ముఖ్య పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్నారు. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ(SVCLLP) బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. దివంగత నారాయణ్ దాస్ నారంగ్‌కి ట్రిబ్యూట్‌గా నిలిచే ఈ చిత్రానికి ఆదిత్య మెరుగు సహ నిర్మాత.

ఈ సినిమా టీజర్, సాంగ్స్‌కు అద్భుత స్పందన వచ్చింది. ఈ రోజు ట్రైలర్ లాంచ్ చేశారు. కొత్తగా పెళ్లయిన జంట జీవితంలోని ప్రేమ, గొడవలు, సరదాలు, సంతోషాలని ట్రైలర్ ఫన్ రోలర్ కోస్టర్ రైడ్‌లా ప్రజెంట్ చేసింది. ప్రియదర్శి నేచరల్, హ్యుమరస్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ప్రియదర్శి, ఆనంది కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి సిట్యువేషన్ ఎంటర్టైనింగ్‌గా వుంది. కానిస్టేబుల్ క్యారెక్టర్‌లో సుమ కనకాల సిగ్నేచర్ మార్క్‌తో అలరించారు. ట్రైలర్ చివర‌లో తను చెప్పిన డైలాగ్ హైలెట్‌గా నిలిచింది.

- Advertisement -

డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ ఫన్ ఎమోషన్‌ని బ్యాలెన్స్ చేస్తూ అందరికీ కనెక్ట్ అయ్యే ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లా ప్రజెంట్ చేశారు. సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి లైవ్లీ విజువల్స్ అందించారు. లియాన్ జేమ్స్ బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ ఫన్ ని మరింత ఎలివేట్ చేసింది. ఎడిటర్ రాఘవేంద్ర తిరున్, ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్ మూలే, డైలాగ్ రైటర్స్ కార్తిక్ తుపురాణి, రాజ్‌కుమార్ అందరూ ది బెస్ట్ వర్క్ ఇచ్చారు. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్‌లో వున్నాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News