Tuesday, February 10, 2026
Homeమహబూబ్‌నగర్‌Renovation | పాత బస్టాండుకు పూర్వవైభవం.

Renovation | పాత బస్టాండుకు పూర్వవైభవం.

  • అఖిలపక్ష ఐక్యవేదిక, ప్రజాసంఘాల విజయం..
  • అఖిలపక్ష ఐక్య వేదిక అధ్యక్షుడు, డాక్టర్ సతీష్ యాదవ్..

20 సంవత్సరాలుగా మూతబడ్డ పాత బస్టాండ్ కు పూర్వ వైభవం రావడంతో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ సతీష్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఆర్టీసీ ఆర్ఎం, ఆర్టీసీ అధికారులు పాత బస్టాండ్ ను ప్రారంభించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యం లో పాత బస్టాండ్ ను మంగళవారం పరిశీలించా రు. ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ.. 20 సంవత్సరాలుగా మూతపడ్డ పాత బస్టాండ్ పునరుద్ధరణ కోసం నాలుగు సంవత్సరాలుగా ప్ర జా సంఘాలతో కలిసి అఖిలపక్ష ఐక్యవేదిక పోరా టం చేసిందని గుర్తు చేశారు.

మా పోరాట ఫలితం గా పాత బస్టాండ్ ప్రజలకు అందుబాటులోకి రావ డం అఖిలపక్ష ఐక్య వేదిక విజయమని పేర్కొన్నారు. మా పోరాటానికి సహ కరించిన ప్రజాసంఘాల నాయకులకు, అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులకు, మీడియా మిత్రులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాత బస్టాండ్ సుందరీ కరణ కోసం ఎ మ్మెల్యే, మంత్రి, కలెక్టర్ కల్పించుకొని నిధులు మం జూరు చేసి మరుగుదొడ్ల తో పాటు ప్రజలు ఉండ డానికి తగిన ఏర్పాట్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమంలో కొత్త గొల్ల శంకర్, గౌనికాడి యా దయ్య, బొడ్డుపల్లి సతీష్, శివకుమార్, కృష్ణయ్య, ప్రజా సంఘాల నాయకులు గంధం నాగరాజు, రిటై ర్డ్ హెచ్ఎం శంకర్ గౌడ్, బండారు శ్రీ నివాసులు, ఆ ర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొ న్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News