Thursday, February 12, 2026
HomeజాతీయంChhattisgarh | తుపాకుల మోత

Chhattisgarh | తుపాకుల మోత

  • ముగ్గురు మావోయిస్టుల ఎన్ కౌంటర్
  • ఆదివారం ఉదయం ఎదురు కాల్పులు
  • ఇప్పటివరకు 233 మావోల మృతి

ఛత్తీస్గఢ్లో నక్సల్ వ్యతిరేక చర్యలు మరింత వేగం పందుకుంటున్న వేళ సుక్మాలో ఆదివారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ మళ్లీ ఉద్రిక్తతను పెంచింది. బెజ్జి-చింతగుఫా అటవీ కొండల్లో డీఆర్జీ బలగాలు ప్రత్యేక ఆపరేషన్కు బయలుదేరగానే, దాగి ఉన్న మావోయిస్టులు వారిపై అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించడంతో ఇరు వర్గాల మధ్య భీకరం గా ఫైరింగ్ జరిగింది. దానికి ప్రతీకారంగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు అక్కడికక్కడే కుప్పకూలిపోయారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ చవాన్ తెలిపారు.

ఇంకా ఆ ప్రాంతంలో మరికొందరు నక్సల్స్ దాగి ఉన్న అవకాశంఉండటం తో భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని, అవసరమైతే కేంద్రం నుంచి అదనపు బలగాలను కూడా పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటనతో ఈ సంవత్సరం ఛత్తీస్గఢ్లో నక్సల్ ప్రభావ ప్రాంతాల్లో జరిగిన ఎన్ కౌంటర్లలో హతమైన వారి సంఖ్య 262కి చేరడం రాష్ట్ర ప్రభుత్వ చేపట్టిన కఠిన క్రమశిక్షణ చర్యలకు సూచికగా చూస్తున్నారు.

- Advertisement -

బస్తర్ డివిజన్లోని ఏడు జిల్లాల్లోనే 233 మంది మావోయిస్టులు విస్తారంగా జరిగిన ఆపరేషన్లలో ఎన్కౌంటర్ అవ్వడం, గారియాబంద్ 27 మంది, దుర్గ్ డివిజన్లో మరో ఇద్దరు హతమవడం వల్ల నక్సల్ దళాల చేసే దాడులు గణనీయంగా తగ్గినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండే మావోయిస్టుల వ్యూహాలను దెబ్బ తీయడానికి భద్రతా బలగాలు కొత్త టాక్టిక్స్ అమలు చేస్తుండటం, డ్రోన్లు- డిస్టెన్స్ కంట్రోల్ ఎక్విప్మెంట్ టెక్నికల్ సర్వేయలెన్స్ల వినియోగం పెరగటంతో, రాను రాను వారు అడవుల్లో తలదాచుకునే అవకాశాలు కష్టమైపోతున్నాయని పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఇక ఆదివారం జరిగిన తాజా ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రత మరింత కట్టుదిట్టమైంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News