టీఎస్ యూటీఎఫ్ సిద్దిపేట జిల్లా శాఖ కార్యదర్శి చేర్యాల రామచంద్రం డిమాండ్
జగదేవపూర్, నవంబర్ 16(ఆదాబ్ హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం(State Government) పీఆర్సీ రిపోర్ట్(PRC Report)ను వెంటనే తెప్పించుకొని ఫిట్‌మెంట్ ప్రకటించాలని టీఎస్ యూటీఎఫ్(TS UTF) సిద్దిపేట జిల్లా శాఖ కార్యదర్శి చేర్యాల రామచంద్రం డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏ(DA)లను తక్షణం ప్రకటించాలని కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యా హక్కు చట్టాన్ని (RTE) సవరించి టీచర్లల(Teachers)కు భారంగా మారిన టెట్(Tet) నుంచి మినహాయింపు ఇవ్వాలని అన్నారు.
ఐటీ స్లాబ్‌ల(IT Slabs)ను సవరించాలని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 8వ పీఆర్సీ నిబంధనలు మార్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన మెనూను గురుకులాల మాదిరిగా మార్చాలని, ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని, ప్రతి ఉన్నత పాఠశాలకు కంప్యూటర్ ఇన్‌స్ట్రక్చర్, వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలని, రిటైర్ అయిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రావాల్సిన బెనిఫిట్స్, పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలని కోరారు.
