Tuesday, March 3, 2026
Homeమెదక్‌Illegal | అక్రమంగా మట్టి,ఇసుక తరలిస్తే కఠిన చర్యలు

Illegal | అక్రమంగా మట్టి,ఇసుక తరలిస్తే కఠిన చర్యలు

  • తహశీల్దార్ సహదేవ్
  • మట్టి తరలించిన వాహనదారులకు జరిమాన

చిలిపిచేడ్ మండలంలోని మంజీరా నది,చెరువుల్లో అనుమతులు లేకుండా మట్టి,ఇసుక తరలించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సహదేవ్,ఆర్ఐ సునీల్ సింగ్ చౌహన్ హెచ్చరించారు.గురువారం రాత్రి చండూరు శివారులోని మంజీరా నదిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు.

సోమక్కపేట శివారు సామ్లా తండాలోని ప్రభుత్వ భూమి నుంచి మట్టిని తరలింస్తున్న టిప్పర్ ను ఆర్ఐ సునీల్ చౌహాన్ పట్టుకున్నారు.అక్ర మంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ యజమా ని చండూరుకు చెందిన సండ్రు గంగయ్యకు రూ.10 వేలు,ఫైజాబాద్ తండాకు చెందిన రవి రూ.15 వేలు జరిమానా వేసినట్లు తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక,మట్టిని తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్ హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News