కరీంనగర్ లోని విజన్ హై స్కూల్ లో జవహర్ లాల్ నెహ్రూ జన్మదిన సందర్భంగా బాలల దినోత్సవం ను పురస్కరించుకొని బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన దేశంలోని వివిధ రాష్ట్రాల యొక్క వేషధారణ ఎంతగానో ఆ కట్టుకుంది. అదేవిధంగా వారు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి.
ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ సిరిపురం ప్రసాద్ మాట్లాడుతూ మన భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జన్మదిన పురస్కరించుకొని ప్రతి సంవత్సరం చిల్డ్రన్స్ డే ను జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా నెహ్రూ గొప్పతనాన్ని, వారికి పిల్లల పట్ల ఉన్న ప్రేమను పిల్లలకు వివరిస్తూ. విద్యార్థిని విద్యార్థులందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సందవేణి వెంకట్ , ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
