విశాఖపట్నం(Vishakapatnam)లోని ఐటీ హిల్స్(IT Hills)లో 5 కంపెనీలకు భూమిపూజ(Bhumi Puja) చేశానని మంత్రి లోకేష్ వెల్లడించారు. రూ.3,800 కోట్లతో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టుల (Projects) ద్వారా సుమారు 30 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు (Jobs) లభిస్తాయని చెప్పారు. సైల్స్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్, ఐస్పేస్ సాఫ్ట్ వేర్, ఫీనోమ్ పీపుల్స్ ప్రైవేట్ లిమిటెడ్, కె.రహేజా కమర్ జోన్ ఐటీ పార్క్, కపిల్ గ్రూప్ వరల్డ్ ట్రేడ్ సెంటర్(World Trade Center)కు భూమిపూజ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ శ్రీభరత్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, లోకం మాధవి, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
- Advertisement -
