Wednesday, March 4, 2026
HomeతెలంగాణKalvakuntla | దేవనపల్లి కవిత?

Kalvakuntla | దేవనపల్లి కవిత?

  • కుటుంబ విభేదాల మధ్య స్వతంత్ర గుర్తింపు వైపు కవిత అడుగులు
  • తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు..
  • దేవనపల్లి కవితమ్మగా రాజకీయ ప్రవేశమా?
  • జనం బాట కార్యక్రమంతో కొత్త ప్రస్థానం..
  • పేరు మార్పు వెనుక రాజకీయ సంకేతం
  • కుటుంబంతో వచ్చిన విబేధాలు దీనికి కారణమా?
  • స్వతంత్ర రాజకీయ నేతగా ఎదగాలనే సంకేతమా?..
  • జయలలిత లుక్ ముందుకు సాగుతున్న కవిత

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చర్చలన్నీ ఒకే దారిలో ఉన్నట్లే అనిపిస్తోంది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన పేరులోనుంచి ‘కల్వకుంట్ల’ తీసేసి, భర్త ఇంటి పేరు “దేవనపల్లి”ని జోడించబోతున్నారట. ఇకపై ఆమె కేవలం దేవనపల్లి కవితమ్మగా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారని సమాచారం. భారతీయ సంప్రదాయంలో మహిళలు వివాహానంతరం తమ ఇంటిపేరు ను మార్చుకోవడం, తమ భర్త ఇంటి పేరును జోడించుకోవటం కేవలం ఆచారంగా మాత్రమే కాదు. . చట్టబద్దమయిన ఆనవాయితీగా కూడా ఉంది.

ఈ మార్పు అనేది తెలంగాణ సంప్రదాయం లో కూడా పరిపాటే అయితే ఎమ్మెల్సేయే కవిత విషయం లో మాత్రం ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు. కవిత రాజకీయ పునర్జన్మకు నాంది అని చెప్పొచ్చు. రాజకీయ వర్గాల్లో అయితే ఇది కేవలం ఆమె పేరు మార్పు కాదని, తన కొత్త రాజకీయ ప్రస్థానానికి నాంది అని విశ్లేషిస్తు న్నారు. కవిత తీసుకుమన్న ఈ నిర్ణయం వెనుక తమ కుటుంబ విబేధాల మబ్బులు గట్టిగా కమ్ముకున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయం వెనుక కేవలం వ్యక్తిగత కారణాలే కాదు, కుటుంబ విబేధాల చాయలు గాఢంగా కమ్ముకున్నాయని.

- Advertisement -

అసలు ఈ కథ జోగినిపల్లి సంతోష్ రావు దగ్గరనుంచే మొదలైం దట. తర్వాత వరుస బావ తన్నీరు హరీష్ రావుతో విబేధాలు పెరిగి, ఆపై తండ్రి కేసీఆర్, చివరికి అన్న కేటీఆర్ తోనూ రాజకీయ దూరాలు స్పష్టమవుతున్నాయన్నది ఇప్పుడు తెలంగాణలో పబ్లిక్ టాక్. తండ్రి కేసీఆర్ ఉన్న మమకారం కాస్త రాజకీయ విభేదాల మేఘాల కింద కొట్టుకుపోయిందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కవిత అన్న కేటీఆర్, వరసకు బావ అయిన హరీష్ రావుతో కూడా దూరం పెరుగుతున్నదా? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి చర్చించుకుంటున్న విషయం. “ఇంట్లో వాతావరణం చల్లగా నే ఉన్నా.

బయట కవిత యాత్ర రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది” ఇదే ప్రస్తుతం తెలంగాణ లో పొలిటికల్ హాట్ టాపిక్. పాత ఫ్యామిలీ రిలేషన్స్ కంటే కొత్త ప్రజా రిలేషన్స్ కే ప్రాధాన్యం ఇస్తున్న సంకేతాలే ఆమె తాజాగా చేపడుతున్న కార్యక్రమాల్లో కనిపిస్తున్నాయి. ఇక మరో కీలక అంశం.. కవిత పాదయాత్ర “జనం బాట”. ఈ యాత్రను ఆమె పుట్టింటి నుంచి కాకుండా, తన మెట్టింటి నుంచి ప్రారంభించడం గమనార్హం. ఇది కేవలం స్థలం మార్పు మాత్రమే కాదు.. రాజకీయంగా కూడా ఒక ప్రాముఖ్యమైన అంశం. “నేను నా తండ్రి నీడలో కాదు, నా స్వంత దారిలో నడుస్తున్నాను” అని చెప్పే ప్రయత్నం ఇది అని అంటున్నాయి. రాజకీయ వర్గాలు.

ప్రస్తుతం కవిత రూపం, వస్త్రధారణ, ప్రజలతో మాట్లాడే తీరు కూడా పూర్తిగా మారిపోయాయి. తెల్ల చీరలు, పెద్ద బొట్లు, సీరియస్ లుక్.. ఇవన్నీ చూసి చాలామంది “జయలలిత మోడ్ ఆన్ అయిపోయిందేమో!” అంటున్నారు. సోషల్ మీడియాలో ఆమె కొత్త ఫోటోలకు కింద “జయలలిత 2.0 తెలంగాణ ఎడిషన్” అనే క్యాప్షన్లు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఒక ఫోటోలో కేటీఆర్ ఫోటో పక్కన “అక్కా, పేరు మార్చేసావ్, కానీ వాట్సాప్ డీపీ మాత్రం మార్చలేదే!” అని కామెంట్ పెట్టారు నెటిజన్లు.

ఇక్కడ ఒక సీరియస్ అనాలిసిస్ కూడా ఉంది. రాజకీయంగా ఇది “ఆమె తన స్వతంత్రమైన, సొంత గుర్తింపు కోసం వేసిన అడుగు” అని అనేక విశ్లేషకులు అభిప్రాయప డుతున్నారు. “కవిత ఇప్పుడిక కేవలం కేసీఆర్ కుమార్తె కాదు, ఆమె స్వయంగా ఒక రాజకీయనేత గా గుర్తింపు పొందేందుకు ఆమె వేసుకున్న ప్రణాళిక” అని ఒక సీనియర్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. “ఆమెకు ఉన్న మహిళా మద్దతు, గ్రామీణ ప్రాంతాల్లోని పాప్యులారిటీ ఇవన్నీ కలిపి ఒక కొత్త రాజకీయ భవిష్యత్తును సూచిస్తున్నాయని మాత్రం అనవచ్చు.

తెలంగాణలో కవితకి నిజంగానే మంచి ఇమేజ్ ఉంది. ముఖ్యంగా మహిళా సంఘాలు, విద్యార్థి వర్గాలు ఆమె పాదయాత్రలకు బాగా స్పందిస్తున్నాయి. జనం తరలివస్తున్నారు, ఆత్మీయంగా పలుకుతున్నారు. “కల్వకుంట్ల పేరు పోయినా, కవిత గుర్తింపు పోదు” అని ఒక వృద్ధ మహిళ చెప్పిన మాట ఇప్పుడు రాజకీయ నినాదంగా మారింది. అయితే, ఈ యాత్రతో ఆమె దిశ ఎటు? ఇదే ఇప్పుడు రాజకీయ చర్చా వేదికల్లో వేడెక్కిన ప్రశ్న.

కొత్త పార్టీనా? లేక పాత పార్టీకి ప్రత్యామ్నాయ వేదికనా? లేదా కేవలం ప్రజా శ్రద్ధకు నాంది మాత్రమేనా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇంకా కాలమే చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా కూడా ఈ పరిణామంపై చర్చలు మొదలయ్యాయి. కొందరు “ఇది కల్వకుంట్ల కుటుంబంలోని అసంతృప్తికి ఫలితం” అంటుంటే, మరికొందరు “ఇది వారి కుటుంబం నుంచి వచ్చే వ్యూహాత్మకమయిన ప్లాన్ అంటున్నారు. ఒక సీనియర్ నేత నవ్వుతూ. “ఇది రీబ్రాండింగ్, కానీ ఆపరేషన్ ఫ్యామిలీ ఎడిషన్” అని జోక్ చేశాడు.

రాజకీయంగా చూస్తే, కవిత ఇప్పుడు తండ్రి ఛాయల నుంచి బయటకు వస్తూ, కొత్త దారిలో నడవాలని ప్రయత్నిస్తోంది అన్న మాట నిజం. “జనం బాట” కేవలం ప్రజా యాత్ర కాదు, అది ఒక రాజకీయ సందేశం “నేను నా బాటలోనే నడుస్తాను” అనే ధైర్య ప్రకటన. ఇక పక్కన ఉన్న వ్యంగ్య చర్చలు కూడా రాజకీయ కాఫీకి రుచిచేస్తున్నాయి. “పేరు మార్చినా, పాదయాత్ర మార్చడం లేదు కదా! అంతే సరిపోతుంది!” అని జనం నవ్వుతున్నారు. మరి చివరికి ప్రశ్న మాత్రం ఒక్కటే.. ఈ “కవితమ్మ”గా రీబ్రాండింగ్ తెలంగాణ రాజకీయాలను ఎటు తీసుకెళ్తుంది? కల్వకుంట్ల కవిత ఇక కేవలం కవితమ్మ. కానీ ఈ పేరు మార్పు తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు తిప్పబోతోందనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి కవిత రాజకీయ ప్రస్థానం ఎటు మళ్లుతుందో.. కాలమే నిర్ణయించాలి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News