అందం (Beauty) లేదని బాధపడకు.. ఆరోగ్యం(Healthy)గా ఉన్నందుకు ఆనందించు. ఆస్తులు (Assets) లేవని బాధపడకు.. ఆదరణ ఉన్నందుకు ఆనందించు. గుర్తింపు (Recognition) లేదని బాధపడకు.. గౌరవం ఉన్నందుకు ఆనందించు. సమస్యలు (Problems) ఉన్నందుకు బాధపడకు.. సంకల్పం ఉన్నందుకు ఆనందించు. సంపద లేదని బాధపడకు.. సంస్కారం ఉన్నందుకు ఆనందించు. అధికారం (Power) లేదని బాధపడకు.. ఆదుకునే తత్వం ఉన్నందుకు ఆనందించు. పలుకుబడి లేదని బాధపడకు.. ప్రేమా గుణం ఉన్నందుకు ఆనందించు. ఆత్మీయులు లేరని బాధపడకు.. అనుంగు మిత్రులు ఉన్నందుకు ఆనందించు. బలహీనుణ్ని (Weak) అని బాధపడకు.. మనోబలం ఉన్నందుకు ఆనందించు. బంధువులు లేరని బాధపడకు.. భగవంతుడు (God) అండగా ఉన్నాడని ఆనందించు. మరుపు ఉన్నందుకు బాధపడకు.. మరుపే నీ జీవితంలో మార్పు అనందుకు ఆనందించు. మణులు మాన్యాలు లేవని బాధపడకు.. మమత మానవీయత ఉన్నందుకు ఆనందించు.. సంపద లేదని బాధపడకు.. సంతృప్తి ఉన్నందుకు సంతోషించు. హంగూ ఆర్భాటం లేదని బాధపడకు.. దయార్ద్ర హృదయం ఉన్నందుకు ఆనందించు. చీకటిని తిడుతూ బాధపడకు.. చిరుదివ్వెను వెలిగించి ఆనందించు. ఆందోళన ఉన్నందుకు బాధపడకు.. మనోధైర్యం ఉన్నందుకు ఆనందించు.
- నేదునూరి కనకయ్య
