Wednesday, February 11, 2026
Homeవరంగల్‌Threat | వనం విడిచిన కోతులు…గృహం విడిచిన కుక్కలు

Threat | వనం విడిచిన కోతులు…గృహం విడిచిన కుక్కలు

  • గృహం విడిచిన కుక్కలు వనంలోకి జనం…
  • జనంల్లోకి వానరం బెంబేలెత్తుతున్న ప్రజానీకం…..

నర్సంపేట: వనంలోకి జనం వెళ్లి  విచ్చలవిడిగా వనాన్ని ధ్వంసం చేస్తూ పోడు భూములు సాగు చేస్తుంటే అడవిలో హాయిగా జీవనం సాగిస్తున్న వానరాలు జనాలలోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి. మరొక్క పక్క గ్రామ సింహాలుగా పిలవబడే కుక్కలు వీధి కుక్కలను  పెంచడం మానేసి జనం హైబ్రిడ్ కుక్కల వైపు మోజు పెంచుకొని ఇంటికో హైబ్రిడ్ కుక్కని పెంచుతున్న తరుణంలో ఆదరణ లేక ఆహారం పెట్టేవారు లేక గ్రామ సింహాలు సైతం రోడ్ల వెంట స్వైర విహారం చేస్తూ వృద్ధులపై చిన్నపిల్లలపై ఆకలి పోరాటం చేస్తూ క్షతగాత్రులకు గురిచేస్తున్నాయి.

ఎక్కడో ఒకచోట ప్రతినిత్యం ప్రతి గంట కుక్కల దాడిలో బాలురకు గాయాలు వృద్ధులకు గాయాలని అని సోషల్ మీడియాలో వార్తలు పుంకాను  పుంకాలుగా వెలువడుతున్న నేపథ్యంలో వాటికి ఆహారం సరైన మార్గంలో దొరకకపోవడం వల్లే మనుషులపై విచక్షణ రహితంగా దాడులు చేసి ఆహారం కోసం ఆకలి పోరాటం చేస్తున్నాయని జంతు ప్రేమికులు వాపోతున్నారు. అదేవిధంగా అడవిలో పండ్లు ఫలాలు తిని హాయిగా జీవన సాగించే వానరులు సైతం వనాల్ని విడిచి జనంలోకి వచ్చి పంటచేయులను ధ్వంసం చేయడమే కాక పండ్ల తోటలను సైతం విధ్వంసానికి  గురిచేస్తున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి.

- Advertisement -

ఒంటరిగా వెళ్దామంటే అటు కోతుల తోటి, ఇటు కుక్కలతోటి భయం భయంగా ఉంటుందని క్రూర  జంతువుల నుంచి అయినా తప్పించుకోవచ్చు గాని ఈ కోతులు, కుక్కల నుంచి తప్పించుకోలేని పరిస్థితి దాపురించిందని పలువురు రైతులు, కార్మికులు, కర్షకులు వాపోతున్నారు. పట్టణాల్లో పల్లెటూర్లుల్లల్లో  పాలకవర్గాలు లేకపోవడంతోటి కోతుల, కుక్కల బెడదను నివారించే ప్రత్నమ్నయ మార్గాలు కనబడటం లేదని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వ అధికారులే

- Advertisement -
RELATED ARTICLES

Latest News