Thursday, February 12, 2026
HomeతెలంగాణVerification | గ్రూప్-2 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్

Verification | గ్రూప్-2 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్

  • నేటి నుంచి తెలుగువర్సిటీలో ప్రక్రియ

గ్రూప్-2 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను టీజీపీఎస్సీ పరిశీలించనుంది. మంగళవారం నుంచి హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనుంది. ఈ పక్రియ నవంబర్ 26 వరకు కొనసాగనుంది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీశీలన జరుగనుందని టీజీపీఎస్సీ వెల్లడించింది. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు 2 జిరాక్స్ సెట్లు కూడా తమతోపాటు తీసుకురావాల్సి ఉంటుంది.

ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్ల జాబితాను టీజీపీఎస్సీ ఇప్పటికే లిలిలి. బిణూబఞ. ణనీల. తిని వెబ్సైట్లో ఉంచింది. వెరిఫికేషన్కు ఏ రోజు, ఏ షెడ్యూల్లో హాజరు కావాలనే పూర్తి వివరాలను అందుబాటులో ఉంచినట్లు కమిషన్ కార్యదర్శి ప్రియాంక వెల్లడించారు. అభ్యర్థులు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం హాజరు కావాలని సూచించారు. కాగా, కమిషన్ పేర్కొన్న తేదీలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరుకాని అభ్యర్థుల అభ్యర్థిత్వం తదుపరి పక్రియకు పరిగణించబడదని స్పష్టం చేశారు. వెరిఫికేషన్కు హాజరైన వారికి సంబంధించి ఏవైనా పెండింగ్లో ఉన్న పత్రాలు ఉంటే, వాటిని నవంబర్ 29 (రిజర్వ్ డే) సాయంత్రం 5 గంటల తర్వాత అంగీకరించబడవని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News