- ఆడపిల్లలు ఉన్నత విద్యావంతులుగా ఎదగాలి
- ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
- పోషణ మాసోత్సవం,బాల్యవివాహాల నిషేధ చట్టంపై అవగాహన
- ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రసంగం
ఆడపిల్లలకు బాల్యంలో తగిన పోషకాహారం అందజేసి,బాల్య వివాహాలు చేయకుండా ఉన్నత విద్యావంతులుగా వారిని తమ కాళ్లపై తాము నిలబడి ప్రయోజకులు అయితే ఆరోగ్యవంతమైన సమాజం తయారవుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం నర్సాపూర్ ప్రాజెక్టు పరిధిలోని చిలిపిచేడ్ మండల కేంద్రమైన జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పోషణ మాసోత్సవం,బాల వివాహ నిషేధ చట్టం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరై ప్రతి వ్యక్తి రుచి కోసం కాదు ఆరోగ్యం కోసం అన్ని రకాల ఆహార పదార్థాలు తినాలని ముఖ్యంగా స్థానికంగా దొరికే ఆకు కూరలు తీసకొని ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు.ప్రతి ఆడపిల్లను చదివించి ఉన్నత స్థాయికి ఎదిగేలా చూడాలని, ఆడపిల్లల పట్ల వివక్షలు చూపకుండా వారు కూడా ఉద్యోగాలు సంపాదించిన తర్వాత వివాహాలు చేస్తే రాబోయే కాలంలో మంచి ఆరోగ్యవంతమైన సమాజం తయారు చేసుకోవచ్చు అన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యూట్రిషన్ స్టాల్స్ వీక్షించిన ఎమ్మెల్యే నిర్వాహకులను అభినందించారు.

పోషణ అభియాన్ కార్యక్రమంలో ఉత్తమ,అంగన్వాడి టీచర్లకు ఆశా,ఎపిఎం,సిఎ,సిసి పంచాయతీ కార్యదర్శి,ఎఎన్ఎం మెడికల్ ఆఫీసర్,హెల్త్ సూపర్వైజర్, పారిశుద్ధ్య కార్మికులకు,ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా డి డబ్ల్యూ హేమ భార్గవి మాట్లాడుతూ.. బాల్యవివాహాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని దీనికోసం ప్రతి ఒక్కరి సహాయం సహకారం ఖచ్చితంగా ఉండాలని కోరారు.గర్భిణీలకు సామూహిక శ్రీమంతం కార్యక్రమం ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో చిలిపిచేడ్ మండల ఐసిడిఎస్ సూపర్వైజర్ సంతోషిమాత ఎమ్మార్వో ఎంపీడీవో ఏపిఎం వైద్యాధికారి,పంచాయతీ కార్యదర్శులు సీఏ లు సీసీలు ఆశాలు అంగన్వాడి టీచర్లు,షి టీమ్,సఖి టీం గ్రామస్తులు పాల్గొన్నారు.
