Friday, February 27, 2026
HomeరాజకీయంYadagirigutta | ఏడాదైనా రూపాయి ఇవ్వలే

Yadagirigutta | ఏడాదైనా రూపాయి ఇవ్వలే

స్వామివారి ఆలయంపై సీఎం రేవంత్ రెడ్డికి పట్టింపేది?
ఆదాయానికి గండి పడుతున్నా ఊసేత్తని వైనం
స్వామి వారి ఆలయంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం పట్ల త్వరలో ఆందోళనలు
బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ సెక్రెటరీ జనరల్ పాపట్ల నరహరి

యాదగిరిగుట్ట దేవస్థానం, నవంబర్ 9 (ఆదాబ్ హైదరాబాద్): సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి వచ్చి ఏడాదైనా రూపాయి కూడా నిధుల (Funds) కేటాయింపు జరగలేదని బీఆర్ఎస్ పార్టీ (Brs Party) మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ సెక్రెటరీ జనరల్ పాపట్ల నరహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది పుట్టిన రోజు (Birth Day) సందర్భంగా రేవంత్ రెడ్డి.. స్వామి వారి దర్శనానికి వచ్చి అధికారులతో సమీక్షలు జరిపి, పెండింగ్ పనులపై నివేదిక కోరారు. రూ.100 కోట్లు నిధులు కేటాయిస్తానని ప్రకటించి, ఇప్పటికీ గుట్ట అభివృద్దికి ఒక్కరూపాయి కేటాయించకపోవడంపై మండిపడ్డారు.

- Advertisement -

ఆదివారం పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట తొలి సీఎం కేసీఆర్ (KCR) రూ.1300 కోట్ల ప్రభుత్వ ఖాజానాతో స్వామివారి ఆలయాన్ని ప్రపంచమే అబ్బురపడేలా పునర్నిర్మిస్తే రేవంత్ రెడ్డి మాత్రం ఆలయాన్ని కనీసం పట్టించుకోవడం లేదన్నారు. కొండ కింద షాపింగ్ కాంప్లెక్స్‌లు, పెండింగ్ పనులు పూర్తి చేసి టెండర్ల వేస్తే స్వామివారి ఆదాయం పెరిగే అవకాశం ఉన్నా ప్రభుత్వానికి మాత్రం ఆ ఆలోచన లేకపోవడం దారుణమన్నారు. కొండపైన స్వామివారి కళ్యాణ మండపం, సంగీత మండపాలతోపాటు ఇంకా నిర్మించాల్సిన భవనాలు ఉన్నా రేవంత్ రెడ్డి ఊసేత్తడం లేదన్నారు.

ఆలయ పరిసర ప్రాంతాల్లో మరింత అభివృద్ధి జరగాలని, ఇక్కడి ప్రాంతం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కేసీఆర్ ఆలోచిస్తే, అందుకు భిన్నంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (MLA Beerla Ailaiah) అనుచరులు, బినామీలు కొండపైన అడ్డదారిన కాంట్రాక్టులు చేజిక్కించుకొని భక్తులను పీడించుకుంటున్నారని ధ్వజమెత్తారు. స్వామివారి ఆలయాన్ని వ్యాపార సంస్థగా మార్చి డబ్బులు దండుకుంటున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం గుట్టపైన భిన్నమైన వాతావారణం అలుముకుందన్నారు.

కాంట్రాక్టర్ల వద్ద అధికారులు లంచాలకు ఎగబడ్డారని, ఎమ్మెల్యే, ఎంపీల పేరిట పీఆర్వోలుగా చెలామణి అవుతున్న 10 మంది పీఆర్వోలు దర్శనాల దందాలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. కొండపైకి వెళ్లి వాహనాల్లో పీఆర్వోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రోజుకు వందల వాహనాలను కొండపైకి అనుమతినిస్తూ డబ్బులతో జేబులు నింపుకుంటున్నారని తప్పుపట్టారు. బీఆర్ఎస్ హయాంలో లేని విధంగా ఇటీవల దేవస్థాన అధికారి రామారావు ఏసీబీకి పట్టుబడ్డారంటే కొండపైన జరుగుతున్న ఆవినీతి, ఆక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థంచేసుకోవచ్చని చెప్పారు.

టెండర్లు లేకుండానే స్వామివారి వస్త్రాల విక్రయాలు, కొబ్బరి కాయ విక్రయాలు కొనసాగిస్తూ ఆలయానికి గండి కొడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారు అత్యంత శక్తి వంతమైన దేవుడని సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో సహా స్వామివారి ఆదాయన్ని దోచుకుంటున్న ఎవ్వరిని వదిలిపెట్టడని అన్నారు. అంతకు అంత మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం పట్ల త్వరలో కార్యాచరణ

స్వామివారి ఆలయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న నిర్లక్ష్యపు వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ మండలం , పట్టణ శాఖ ఆధ్వర్యంలో త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు గుట్ట అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు కొండపైన జరిగిన ఆవినీతిపై కరపత్రాలు విడుదల చేస్తామన్నారు.

ఊరూరా పాదయాత్ర నిర్వహించి,గుట్టపైన జరుగుతున్న ఆవినీతి ప్రజలకు వివరిస్తామన్నారు. పుట్టిన రోజు సందర్భంగా మూసి ప్రక్షాళన చేస్తానని భీమలింగం ఆలయం వద్ద పూజలు నిర్వహించి, పట్టించుకోవడం లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శులు పేరబోయిన సత్యనారాయణ, ఆరే శ్రీధర్, నాయకులు మాటూరి బాలయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News