మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు(Mahila Congress State Vice President), నల్గొండ పట్టణ మాజీ కౌన్సిలర్ దుబ్బ అశోక్ సుందర్ సతీమణి దుబ్బ రూప (Dubba Rupa) ఈ రోజు హైదరాబాద్లోని ఓమ్ని ఆసుపత్రిలో హఠాన్మరణం (Sudden Death) చెందారు. ఆమె మృతి పట్ల డీసీసీ అధ్యక్షుడు(DCC President), ఎమ్మెల్సీ (Mlc) కేతావత్ శంకర్ నాయక్ (Ketawat Shankar Nayak) సంతాపం తెలిపారు. దుబ్బ రూప ఇకలేరని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచార కార్యక్రమంలో తనతోపాటు చురుకుగా పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం చేయటంలో ఆమె తన వంతు కృషి చేశారని పేర్కొన్నారు. దుబ్బ రూప మరణం.. పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. అశోక్ సుందర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Mlc Shankar Nayak | దుబ్బ రూప మృతి పట్ల సంతాపం
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
