Saturday, March 28, 2026
Homeరంగారెడ్డిElectricity | నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం

Electricity | నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం

ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని విద్యుత్ చీఫ్ ఇంజనీర్ కామేష్ అన్నారు. సిఎండి ఆదేశాల మేరకు దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని చీర్యాల గణేష్ టౌన్‌షిప్, ఎస్సీ కాలనీలలో గురువారం విద్యుత్ అధికారులు ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారి చీఫ్ ఇంజనీర్ కామేష్ హాజరై అధికారులతో కలిసి కాలనీలలో పర్యటించి, విద్యుత్ సమస్యలను పరిశీలించి తక్షణమే చర్యలు చేపట్టమన్నారు.

చెట్ల కొమ్మలు తొలగింపు, డిటిఆర్ నిర్వహణ పనులు, యార్డ్ క్లీనింగ్ పనులు గణేష్ టౌన్‌షిప్ గేట్ దగ్గర ఎస్సీ కాలనీ ట్రాన్స్‌ఫార్మర్‌లలో విద్యుత్ అంతరాయాల వంటి సమస్యలు ఎక్కడున్నా తక్షణమే గుర్తించి మరమ్మతులు చేపట్టేందుకు ప్రజాబాట చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కీసర డివిజన్ డిఈ టి. లింగయ్య, ఏడిఈ సిహెచ్. నంద కిషోర్, ఏఈ మురళీకృష్ణ, సెక్షన్ సిబ్బంది శ్రీనివాసులు నరసింహ అజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News