Homeహైదరాబాద్‌Naveen Yadav | నవీన్ యాదవ్‌కి ‘కొల్లాపూర్’ మద్దతు

Naveen Yadav | నవీన్ యాదవ్‌కి ‘కొల్లాపూర్’ మద్దతు

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి రోజురోజుకీ పెరుగుతున్న సపోర్ట్
‘కొల్లాపూర్ నియోజకవర్గ వలస ప్రజల ఆత్మీయ సమ్మేళనం’

మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి (JubileeHills Congress Candidate) నవీన్ యాదవ్‌కు మద్దతుగా ‘కొల్లాపూర్ (Kollapur) నియోజకవర్గ వలస ప్రజల ఆత్మీయ సమ్మేళనం’ జరిగింది. ఈ సందర్భంగా నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. ఆ రోజుల్లో పొట్ట చేత పట్టుకొని పట్నం వచ్చిన కొల్లాపూర్ ప్రజలకు అడ్డ మీద పూలు, పండ్లు, చేపల వ్యాపారం చేసుకునే అవకాశాలు కల్పించడంలో తమ కుటుంబం ప్రత్యేక పాత్ర పోషించడం గర్వకారణంగా ఉందని చెప్పారు.

- Advertisement -
WhatsApp Image 2025 11 06 at 15.36.22

ఆ సమయంలో ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వకపోయినా తన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ (Chinna Srishailam Yadav) ముందుకొచ్చి వలస ప్రజలకు ఇళ్ల స్థలాలు, వ్యాపార సదుపాయాలు అందించి వారు స్థిరపడేలా చేశారని తెలిపారు. అదే తమ కుటుంబ సేవాతత్వం, కాంగ్రెస్ పార్టీ ఆత్మ అని వివరించారు.

WhatsApp Image 2025 11 06 at 15.36.21 2

‘జూపల్లి కృష్ణారావు ఎప్పుడూ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తుంటారు. ఆయన నాయకత్వంలో జూబ్లీహిల్స్‌లో ఉన్న కొల్లాపూర్ ప్రజలు కూడా తమ సమస్యలను నేరుగా చెప్పగలుగుతున్నారు. మనందరి ఐకమత్యంతో ఈ సారి జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. మీ ప్రేమ, ఆశీర్వాదం నాకు మరింత శక్తినిస్తోంది’ అని నవీన్ యాదవ్ పేర్కొన్నారు. ఆయన ప్రసంగం విన్న కొల్లాపూర్ వలస ప్రజలు హర్షాతిరేకంతో కరతాళధ్వనులు చేశారు. జయహో నవీన్ యాదవ్.. జయహో కాంగ్రెస్.. అని నినాదాలు చేశారు.

WhatsApp Image 2025 11 06 at 15.36.21 1

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ‘కొల్లాపూర్ ప్రజలు కష్టపడి పనిచేసే వారు. నమ్మకస్తులు. నవీన్ యాదవ్ లాంటి యువ నాయకుడు మీతో ఉంటే జూబ్లీహిల్స్‌లో మీ గొంతు బలంగా వినిపిస్తుంది. మనందరం కలిసి పనిచేసి కాంగ్రెస్‌కు విజయం సాధిద్దాం’ అని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News