HomeఫోటోలుTarakeshwari | ఘనంగా ‘తారకేశ్వరి’ ప్రీ-రిలీజ్

Tarakeshwari | ఘనంగా ‘తారకేశ్వరి’ ప్రీ-రిలీజ్

తెలుగు ప్రేక్షకుల ముందుకు చాలా రోజుల తర్వాత ఓ సస్పెన్స్ సెంటిమెంటల్ థ్రిల్లర్(Suspenseful Sentimental Thriller) రాబోతోంది. శ్రీ శివసాయి ఫిలిమ్ బ్యానర్‌పై వెంకట్ రెడ్డి నంది (Venkat Reddy Nandi) స్వీయదర్శకత్వంలో శ్రీకరణ్, అనూష, షన్ను హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘తారకేశ్వరి’. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్(Prasad Labs)లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ, సాహిత్య, సంగీత రంగ ప్రముఖులు పాల్గొని చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

WhatsApp Image 2025 11 03 at 4.44.05 PM 1

అన్విక ఆడియో (Anvika Audio) అధినేత సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. ‘‘గతేడాది నా దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిపర్వం’(Adiparvam) మంచి పేరు తెచ్చుకుంది. అమ్మవారి ఆశీర్వాదంతో ‘తారకేశ్వరి’ ఆడియోను మా అన్విక ఆడియో సంస్థ ద్వారా విడుదల చేయడం ఆనందంగా ఉంది. దర్శకుడు వెంకట్ రెడ్డి అద్భుతంగా సినిమాను తీర్చిదిద్దారు. నటీనటులందరూ టాలెంట్‌తో సినిమాకు బలాన్ని ఇచ్చారు. ఈ చిత్రం తప్పకుండా సూపర్‌హిట్ అవ్వాలని కోరుకుంటున్నా” అన్నారు.

- Advertisement -

‘మీలో ఒకడు(Meelo Okadu)’ హీరో కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘తారకేశ్వరి’ పాటలు విన్నా. డ్ర‌మ్స్ రాము సంగీతం అద్భుతంగా ఉంది. నవంబర్ 7న విడుదల కానున్న ఈ చిత్రాన్ని అందరూ తప్పకుండా ప్రోత్సహించాలి. ఇప్పటివరకు 16 సినిమాలు చేసిన వెంకట్ రెడ్డి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. కళామతల్లిని నమ్ముకొని ఎంతో మందికి అవకాశాలు ఇస్తున్నారు. ఈ సినిమా హిట్ అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నా” అన్నారు.

WhatsApp Image 2025 11 03 at 4.46.57 PM 1

నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘హీరోయిన్ అనూష(Anusha)కు మంచి భవిష్యత్తు ఉంది. పెద్ద స్టార్‌లు కూడా మొదట్లో కష్టాలు ఎదుర్కొన్నారు. వెంకట్ రెడ్డి కొత్త ట్యాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తారు. వారి ప్రతిభను వెలికి తీయడంలో ప్రత్యేకం’ అన్నారు.

దర్శకుడు, నిర్మాత వెంకట్ రెడ్డి నంది మాట్లాడుతూ.. ‘‘తారకేశ్వరి’ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. ఈ స్థాయికి రావడంలో మొత్తం చిత్ర యూనిట్ కృషి ఉంది. నవంబర్ 7న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు ప్రేక్షకుల ఆశీర్వాదాలు కావాలి” అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ డ్ర‌మ్స్ రాము మాట్లాడుతూ.. “వెంకట్ రెడ్డి 16 సినిమాల్లో సగానికి పైగా నేను సంగీతం అందించా. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం గర్వంగా ఉంది. ఈ సినిమాకి సంగీతం చాలా చక్కగా కుదిరింది. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం ఉంది” అన్నారు.

WhatsApp Image 2025 11 03 at 11.28.17 PM

హీరో శ్రీకరణ్ మాట్లాడుతూ.. “తారకేశ్వరి’ ఓ పల్లెటూరి యథార్థ ఘటన (A true story from the village) ఆధారంగా తెరకెక్కిన సినిమా. గ్రామీణ వాతావరణంలో జరిగిన షూటింగ్ అనుభవం ఎంతో ప్రత్యేకం. దర్శకుడు వెంకట్ రెడ్డి నంది అద్భుతమైన కథను తెరపై చూపించారు. నవంబర్ 7న థియేటర్లలో చూసి పెద్ద హిట్ చేయాలని ప్రేక్షకులను కోరుకుంటున్నా” అన్నారు.

హీరోయిన్ అనూష మాట్లాడుతూ.. “సినీ రంగంలోకి రావడం అమ్మాయిలకు అంత సులభం కాదు. నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే నాకు ఈ అవకాశం దక్కింది. తొలి అవ‌కాశం ఇచ్చిన వెంకట్ రెడ్డికి ధన్యవాదాలు. సినిమా అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉంది” అన్నారు.

చిత్రయూనిట్ సభ్యులు మాట్లాడుతూ.. “ట్రైలర్‌కు ఇప్పటికే అద్భుతమైన స్పందన లభించింది. చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తే కొత్త ట్యాలెంట్‌కు మరిన్ని అవకాశాలు వస్తాయి” అన్నారు.

నటీనటులు: శ్రీకరణ్, అనూష, షన్ను, వెంకట్ రెడ్డి తదితరులు
దర్శకుడు, నిర్మాత: వెంకట్ రెడ్డి నంది
బ్యానర్: శ్రీ శివ సాయి ఫిలిం
మ్యూజిక్: డ్ర‌మ్స్ రాము
పీఆర్‌వో: కడలి రాంబాబు, అశోక్ దయ్యాల

- Advertisement -
RELATED ARTICLES

Latest News