దుస్తులు ఉతుకుతుండగా కాలుజారడంతో ప్రమాదం
సిద్దిపేట: ప్రమాదవశాత్తూ చెరువులో పడి యువకుడు (Young Man) మృతిచెందాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా (Siddipet District) కొండపాక మండలం మర్పడగ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. అందిపురం రమేష్(32).. తల్లి సంవత్సరీకం నేపథ్యంలో దుస్తులు ఉతకడం (Clothes Washing) కోసం అన్న రమేష్, వదిన కరుణతోపాటు వెళ్లాడు. చెరువు మెట్ల పైన బట్టలు ఉతుకుతుండగా కాలు జారి (Foot Slip) నీళ్లల్లో పడ్డాడు. ఈత (Swimming) రాకపోవడంతో ఒడ్డుకు రాలేకపోయాడు. సోదరుడు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. కొద్దిసేపటి తర్వాత అతణ్ని బయటకు తీయగా మృతి చెందాడు.
- Advertisement -
