Tuesday, February 10, 2026
Homeఆంధ్రప్రదేశ్Sajjanar | సమాజానికి సజ్జనార్ మనస్ఫూర్తిగా మనవి

Sajjanar | సమాజానికి సజ్జనార్ మనస్ఫూర్తిగా మనవి

తల్లిదండ్రులందరికి(Parents), సమాజం(Society)లోని ప్రతి ఒక్కరికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (Hyderabad Police Commissioner) సజ్జనార్ కొన్ని విషయాలు మనస్ఫూర్తిగా మనవి చేశారు. ఒక ప్రమాదం (Accident) మనందరికీ పాఠం కావాలని సూచించారు. కర్నూల్ బస్సు అగ్ని (Kurnool Bus Fire) ప్రమాదానికి దారితీసిన కారణాలను, ఆ దుర్ఘటన వల్ల జరిగిన ప్రాణ, ఆర్థిక నష్టాన్ని (Loss) దృష్టిలో ఉంచుకొని పలు అంశాలను సొసైటీ పరిగణనలోకి తీసుకోవాలని కోరారు(Request). అవి..

  • ఒక్క నిర్లక్ష్యం వందల కుటుంబాల జీవనాన్ని ఛిద్రం చేస్తుంది.
  • ఒకరు తాగి రోడ్డు మీదకు రావడం వల్ల జరిగిన ప్రమాదంలో 20 ప్రాణాలు పోయాయి.
  • ఆ 20 మంది మృతితో 20 కుటుంబాలు కన్నీటిలో మునిగిపోయాయి. ప్రతి ఇంట్లో తీవ్ర ఆవేదన నెలకొంది.
  • మరణించిన శంకర్ కుటుంబం కూడా రోడ్డున పడింది.
  • ఒక్క తప్పటడుగు జీవితం మొత్తాన్ని మార్చేసింది.
  • బస్ డ్రైవర్, క్లీనర్, యజమాని జైలు పాలయ్యారు.
  • ట్రావెల్స్ యాజమాన్య కార్యాలయాలు మూతపడ్డాయి.
  • వందల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు.
  • ఈ ఒక్క ప్రమాదం వల్ల మొత్తం 250 కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా కూలిపోయాయి.
  • వ్యాపారాలు మూతపడ్డాయి.
  • కుటుంబాలు అప్పుల్లో మునిగాయి.
  • నెలాఖరులో ఇఎంఐలు, అద్దెలు చెల్లించలేని పరిస్థితి.
  • ఒకరి నిర్లక్ష్యం వందల మంది జీవనాన్ని నాశనం చేస్తుందని ఈ సంఘటన మనకు చెబుతోంది.
  • తల్లిదండ్రులారా మన పిల్లలు రాత్రి 10 దాటిన తర్వాత ఎక్కడ ఉన్నారో గమనించండి.
  • నా పిల్లాడు అలాంటివాడు కాదు అనే నమ్మకాన్ని మించి నా పిల్లాడికి జాగ్రత్తగా ఉండమని నేర్పాలి.
- Advertisement -
RELATED ARTICLES

Latest News