Tuesday, March 3, 2026
Homeహైదరాబాద్‌Naveen Yadav | కేసులు నిజమైతే హైదరాబాద్ వీడుతా

Naveen Yadav | కేసులు నిజమైతే హైదరాబాద్ వీడుతా

  • లేదంటే కేటీఆర్, హరీష్ రావు వీడుతారా
  • జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ సవాల్
  • జూబ్లీహిల్స్ ఎన్నికపై కాంగ్రెస్ వ్యూహం
  • డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సవాళు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై బీఆర్ఎస్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. దీనికి ప్రతిగా నవీన్ యాదవ్ బీఆర్ఎస్ నాయకులకి గట్టి సవాల్ విసిరారు. తన మీద పెట్టిన కేసులు నిజమైతే తాను రాజకీయాలని వదిలి.. హైదరాబాద్ విడిచి వెళ్లిపోతానని ఛాలెంజ్ చేశారు. కానీ ఆ కేసులు ఫాల్స్ అని తేలితే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధమా..? అంటూ సవాల్ విసిరారు.

కేసీఆర్ ప్రభుత్వం తనపై, తన కుటుంబ సభ్యులపై, అనుచరులపై ఒకే సంవత్సరంలో 20 నుంచి 30 తప్పుడు కేసులు పెట్టిందని ధ్వజమెత్తారు. తన మీద రౌడీ అని ప్రచారం చేయడంపై బీఆర్ఎస్ నేతల కుట్ర ఉందని విమర్శించారు నవీన్ యాదవ్. తనకు న్యాయవ్యవస్థ నమ్మకం కలిగించిందని.. తనను కాపాడిందని ఉద్ఘాటించారు. అలాగే, కాంగ్రెస్ ప్రచార రథాన్ని తగులబెట్టే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై కూడా కేసు నమోదైందని తెలిపారు. పోలీసులు ఈ విషయంపై చర్య తీసుకుంటారని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్పైన విశ్వాసం ఉంచారని నవీన్ యాదవ్ నొక్కిచెప్పారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ గెలుపుతోనే సాధ్యమవుతుందని నవీన్ యాదవ్ స్పష్టం చేశారు.

- Advertisement -

డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తంది. ప్రతి డివిజన్ వారీగా మంత్రులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉప ఎన్నికలో ప్రతి ఓటు కీలకమని భావించిన సీఎం, బలమైన మంత్రులను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో రహమత్ నగర్ డివిజన్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను నియమించారు. బోరబండ డివిజన్ బాధ్యతలు సీతక్క మల్లు రవికి అప్పగించారు. వెంగళ్ రావునగర్ డివిజన్ తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి సమన్వయం చేస్తారు. సోమాజిగూడ డివిజన్ పర్యవేక్షణ బాధ్యతలు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ వహించనున్నారు.

షేక్పట డివిజన్ బాధ్యతలు కొండా సురేఖ, వివేక్ తీసుకుంటారు. ఎర్రగడ్డ డివిజన్ను దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు చూసుకుంటారు. అలాగే యూసుఫ్ గూడ డివిజన్ పర్యవేక్షణ ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నంలకు అప్పగించారు. ఉప ఎన్నికలో సమన్వయం, ప్రచార వ్యూహం, స్థానిక సమస్యల పరిష్కారం వంటి అంశాలను ప్రతి మంత్రి స్థాయిలో పర్యవేక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News