సురక్ష సేవా సంఘం రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రికి తరలిస్తుంది. సాధారణంగా రోడ్డు ప్రమాదలు జరిగే టప్పుడు.. చుట్టుపక్కల అంతా జనాలు పోగై చూస్తూ నిలబడతారు గానీ ఎవరూ సాయం చేయటానికి ముందుకు రారు. కానీ సురక్ష దగ్గరుండి మరీ ఆస్పత్రికి తరలించి. అంతా తామే చూస్కుని అవసరమైతే ఆస్పత్రి బిల్లు కూడా చెల్లించడం జరుగుతుంది.

ఉచిత శిక్షణా శిబిరాలు
సురక్ష సేవా సంఘం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు రాష్ట్ర, జాతీయ భద్రతా విభాగాలు లో పోటీ పరీక్షల కొరకు ఉచిత శిక్షణ ఇచ్చి ఎంతోమందిని కానిస్టేబుళ్లు గా, పోలీసు అధికారులు గా, సైనికులుగా తయారు చేసి వారి జీవితాల్లో కొత్త వెలుగులు చూడటం జరిగింది.

ఇలా ఎన్నో వేలాది సేవా కార్యక్రమాలు చేపట్టి.. బడుగు బలహీనులు, నిరుపేదలకు అండగా నిలబడటం జరిగింది. సురక్ష సేవా సంఘం లో ఒక రోజు వారీ దినసరి కూలీ నుండి రోజుకి లక్షలు సంపాదించే వ్యాపారస్తుల వరకూ… చిన్న ఉద్యోగి నుండి రెవెన్యూ, పోలీస్, జ్యుడీషియల్, లో ఉన్నతాధికారుల వరకూ… కార్యకర్త నుండి రాజకీయ నేతల వరకూ… క్రీడారంగం, వ్యవసాయం, సినిమారంగం ఇలా ప్రతీ రంగం లో ఉన్న వారూ… సురక్ష సేవా సంఘలో సభ్యులుగా కలిగి యున్నారు… సొంత వారినే కాదని.. కన్న తల్లి దండ్రులను పట్టించుకోని ప్రస్తుత సమాజంలో… వారి సమస్య తమ సమస్యగా భావించి.. వారి కష్టం తమ కష్టంగా అనుకొని… సాటి వ్యక్తి కి సాయపడాలనే… సదుద్దేశ్యంతో… సామాజిక సేవ ను ఒక మహా యజ్ఞం లా భావించి… ముందుకు దూసుకు పోతున్న సురక్ష సేవా సంఘం భవిష్యత్తు లో మరిన్ని సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావాలని… దానికి మీ అందరి సహకారం ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము…
ధన్య వాదాలు తో….
ఇట్లు
మీ..
కిక్కర గోపీ శంకర్ యాదవ్
MA (HISTORY),
MA (TELUGU),
MA (political science),
MA (RDOL),
MA (SOCIALOGY),
Msc (PSYCHOLOGY),
DHRM,
CPNGOM,
CSWCJS,
PSARA (IITA MOINABAD),
LLB.
వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు
సురక్ష సేవా సంఘం తెలంగాణ
