Thursday, February 12, 2026
HomeతెలంగాణCM REVANTH: గ్రూప్ 2 అభ్యర్థులకు నియామకపత్రాలు

CM REVANTH: గ్రూప్ 2 అభ్యర్థులకు నియామకపత్రాలు

హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులో భాగంగా టీజీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. 783 మందికి అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇచ్చారు. నిస్సహాయులకు సహాయం అందించటమే మన బాధ్యతని సూచించారు. తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకోవాలని, పుట్టి పెరిగిన ఊరును డెవలప్ చేసుకోవాలని అన్నారు. ఈ మేరకు గ్రూప్ 2 ఉద్యోగం వచ్చినవాళ్లందరూ అంకితమవుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగం వచ్చినవాళ్లు తల్లిదండ్రులను పట్టించుకోకపోతే వాళ్ల వేతనంలో కొత పెట్టి తల్లిదండ్రులకు ఇస్తామని తెలిపారు. ఈ మేరకు త్వరలో చట్టం తెస్తామని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News