పచ్చని తెలంగాణ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చాలని కుట్రలు పన్నుతున్నారా…? పచ్చని తెలంగాణలో కసాయిల పెద్దతరమైంది.. ప్రజలు ఒకటి కోరితే.. ప్రభువు మరొకటి వరమిచ్చినట్టు.. ఈ కపట నాటకాలు ఏందీ.. రోజుకు ఒక ఆట.. పూటకు ఒక మాట మాట్లాడుతూ కాలం గడుపుతూ.. ప్రజలను మభ్యపెట్టింది చాలు.. తెలంగాణ ప్రజలకు కోపం వస్తే ఏం జరుగుతుందో.. సకల జనుల సమ్మెలో చూడలేదా..? అయినా మీరు ఉద్యమంలో లేరు కదా.. తెలంగాణ ప్రజలతో కులాల పేరుతో ఆటలాడితే ఆట కట్టించే దిశలో ప్రజలు నిర్ణయం తీసుకొని సిద్ధంగా ఉన్నారులే.
– మర్రి నాగిరెడ్డి