Monday, February 23, 2026
Homeకెరీర్ న్యూస్ఏపీపీజీసెట్-2025 ఫలితాల విడుదల

ఏపీపీజీసెట్-2025 ఫలితాల విడుదల

ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రస్ట్ టెస్ట్-2025 ఫలితాలు ఇవాళ (జూన్ 25 బుధవారం) విడుదలయ్యాయి. వీటిని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ‘ఎక్స్’లో రిలీజ్ చేశారు. వివరాలను సెట్ చైర్మన్ ప్రొఫెసర్ అప్పారావు, కన్వీనర్ ప్రొఫెసర్ పీసీ వెంకటేశ్వర్లు తిరుపతిలో వెల్లడించారు. 25 వేల 688 మంది రిజిస్టర్ చేసుకోగా 88.60 శాతం మంది పాస్ (19 వేల 488 మంది ఉత్తీర్ణులు) అయ్యారని చెప్పారు. ఈ నెల 9 నుంచి 12 వరకు పరీక్షలు జరిగినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News