Tuesday, February 10, 2026
Homeఆంధ్రప్రదేశ్Amaravathi | గణతంత్ర దినోత్సవాలకు సర్వం సిద్ధం

Amaravathi | గణతంత్ర దినోత్సవాలకు సర్వం సిద్ధం

77వ గణతంత్ర దినోత్సవాలను(Republic Day Celebration) జనవరి 26 సోమవారం ఉదయం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్దం చేసింది. అమరావతి రాజధాని పరిధి విశాల విస్తీర్ణంలో సువిశాలంగా, సుందరంగా అభివృద్ధి చేసిన కోర్ క్యాపిటల్ ఏరియాలో తొలిసారిగా ఆహ్లాదకర వాతావరణంలో భారీ ఏర్పాట్లు చేశారు. పచ్చదనం, విశాల ప్రాంగణాలు, అత్యుత్తమ మౌలిక వసతులతో ఆ ప్రాంతం వేడుకలకు మరింత శోభనిచ్చి పాల్గొన్నవారందరికీ మరిచిపోలేని అనుభూతిని కలిగించనుంది. గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిధిగా గవర్నర్ అబ్ధుల్ నజీర్ అహ్మద్(Governor Abdul Nazir Ahmed), అతిథులుగా సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రులు, హైకోర్టు న్యాయాధిపతులు, రాజధానికి భూములిచ్చిన రైతులు హాజరుకానున్నారు.

శనివారం ఉదయం 77వ గణతంత్ర దినోత్సవాల పరేడ్ ఫుల్ డ్రెస్ రిహార్సల్‌ను ఘనంగా నిర్వహించారు. పరేడ్ రిహార్సల్‌కు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు హాజరై పరేడ్‌ను పరిశీలించారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ పరేడ్ కమాండర్ ఆర్.సుస్మిత నుంచి డీజీపీ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ముందుగా ఇండియన్ ఆర్మీ నాయిబ్ సుబేదార్ ఎల్.కె.ప్రసాద్, కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ జీవీ రామిరెడ్డి, సీఆర్పీఎఫ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ చెన్వీర్ గౌడ, కేరళ ఆర్మ్ డ్ పోలీస్ సీవీ జన్ సాన్, విశాఖపట్టణం ఏపీఎస్పీ 16 వ బెటాలియన్‌కు ఎస్వీ రమణ, ఏపీ బ్రాస్ బాండ్‌లో ఏపీఎస్పీ 11 వ బెటాలియన్‌కు చెందిన టీవీ రమణ, ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌కు చెందిన ఎస్.శ్రీనివాసులు, ఇండియన్ ఆర్మీ పైప్ బాండ్‌కు సుబేదార్ మొహంతీ, జీవీ సుబ్బారావు, ఎన్.సీ.సీ. బాయ్స్‌కు జయంత్ వర్లోత్, ఎన్.సీ.సీ. గర్ల్స్‌కు రేవతి, ఏపీ సోషల్ వెల్ఫేర్‌కు కె.సునీత్ కుమార్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు ఏపీ మోడల్ స్కూల్, పాణ్యంకు చెందిన వై.ఇషాక్ రాజు, యూత్ రెడ్ క్రాస్‌కు పి.సాయి రోహిత్ కమాండర్లుగా వ్యవహరించారు. వివిధ కంటింజెంట్స్ పరేడ్‌లో పుల్ డ్రెస్ రిహార్సల్స్ కవాతు ప్రదర్శించారు.

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వివిధ శాఖలకు చెందిన 22 శకటాలను ప్రదర్శించారు.. వీటిలో వందేమాతరానికి 150 వసంతాలు ఇతివృత్తంగా సాంస్కృతిక శాఖ, పది సూత్రాల మిషన్ కింద పేదరికం లేని సమాజం(Zero Poverty) ఇతివృత్తంతో ప్రణాళికా శాఖ, సెర్ఫ్(SERP), జనాభా నిర్వహణ, మానవ వనరుల అభివృద్ధి(Population Management & Human Resource Development) ఇతివృత్తంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, నైపుణ్యం, ఉపాధి(Skilling & Employment) ఇతివృత్తంతో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, పాఠశాల విద్యా శాఖ, పరిశ్రమల శాఖ, పర్యాటక శాఖ, నీటి భద్రత(Water Security) ఇతివృత్తంతో జలవనరుల అభివృద్ది శాఖ, మైక్రో ఇరిగేషన్, అటవీ శాఖ, రైతు-వ్యవసాయ సాంకేతికత(Farmer–Agri Tech)తో వ్యవసాయ శాఖ, మత్స్య శాఖ, ప్రపంచ ఉత్తమ లాజిస్టిక్స్(Global-Best Logistics) అంశంతో మౌలిక వసతులు & పెట్టుబడులు, సముద్ర, వైమానిక రంగాలు, సీఆర్డీఏలు, వ్యయ అత్యుత్తమీకరణ (ఖర్చుతగ్గింపు)–శక్తి, ఇంధనం(Cost Optimization–Energy & Fuel) ఇతివృత్తంతో నెడ్కాప్ (ఇంధనం), ఉత్పత్తి పరిపూర్ణత(Product Perfection), చేనేత, జౌళి శాఖ, ఉద్యానవన శాఖ లు, స్వచ్ఛ ఆంధ్ర(Swachh Andhra) పురపాలక & పట్టణాభివృద్ది శాఖ(స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్), పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ది శాఖ, జీవితంలోని అన్ని రంగాల్లో లోతైన సాంకేతికత(Deep Tech–All Walks of Life) ఇతివృత్తంతో ఆర్టీజిఎస్(RTGS) శాఖల శకటాలను రూపొందించారు. పరేడ్ పుల్ డ్రెస్ రిహార్సల్స్‌లో గుంటూరు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ, పోలీస్ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News