Homeవరంగల్‌Mulugu | ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Mulugu | ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

  • ఊరూరా రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
  • జాతీయ జెండాను ఎగురవేస్తున్న ములుగుజిల్లా కలెక్టర్ టి.ఎస్.దివాకర్

ములుగు జిల్లాకేంద్రం తోపాటు ఆయా మండల కేంద్రాలు, వివిధ గ్రామాల్లో ప్రభుత్వ, ప్రభుత్వెతర కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో ఊరు వాడ పురవీధుల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగానిర్వహించారు.జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో,ఏటూరునాగారం ఐ.టి.డీ. ఏ తహసీల్దార్,ఎంపిడిఓ కార్యాలయాల్లో మువ్వన్నెల జాతీయ జండాను కలెక్టర్, ఆర్డీవో, పీవో, ఎ తహసీల్దార్,ఎంపిడివో లు ఎగురవేశారు. జిల్లా ఆసుపత్రిలో, సాంఘిక సంక్షేమ బాలికల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ జాతీయ జెండాలు ఎగరవేశారు. సిబ్బందితో కలిసి జనగణమన గీతాన్ని ఆలపించారు.

77th Republic Day Celebrations Across Mulugu District

మండలంలోని అన్ని గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచులు, విద్యా వ్యాపార వాణిజ్య సంస్థల్లో సర్పంచ్ పాటు అన్ని గ్రామాల్లో ప్రజా సర్పంచులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయా కార్యాలయాలలో తహశీల్దార్, డిప్యూటీ తాసిల్దార్, ఎంఆర్ఐ, ఏపీవో సూపర్డెంట్, మండల సమైక్య మొదలగు సిబ్బంది పాల్గొన్నారు. మండలంలోని అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో పంచాయతీ కార్యదర్శులు ప్రజాప్రతినిధులు కార్యాలయ సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News