Homeమహబూబ్‌నగర్‌Republic Day | బిజెపి కార్యాలయంలో 77 వ గణతంత్ర వేడుకలు.

Republic Day | బిజెపి కార్యాలయంలో 77 వ గణతంత్ర వేడుకలు.

77 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బిజెపి నాయకులతో కలిసి బిజెపి జిల్లా అధ్యక్షులు డి నారాయణ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు డి నారాయణ మాట్లాడుతూ.. వందలాది సంవత్సరాలు బ్రిటిష్ దాస్య సుంకలాల్లో బంధించబడ్డ భారతావానికి లక్షలాదిమంది స్వాతంత్ర సమరయోధులు ఆత్మార్పణ చేసుకుంటే దేశానికి స్వేచ్చా వాయువులు లభించాయని అన్నారు.

ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని ఆమోదించుకొని 77 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో ప్రపంచ అగ్ర రాజ్యాలను తలదన్నేలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం నాలుగో స్థానానికి చేరుకున్నదని కొనియాడారు. వికసిత భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ సంకల్ప బలంతో 140 కోట్ల భారత ప్రజల సహకారంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మొదటి స్థానానికి చేరుకోవడం లక్ష్యంగా మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
BJP District Office Republic Day Celebrations1

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి, సబిరెడ్డి వెంకటరెడ్డి, ఓబీసీ మోర్చా మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి బి శ్రీశైలం, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు గొర్ల బాబురావు, కోశాధికారి బి కుమారస్వామి, కార్యదర్శులు జంగం సురేందర్, సరోజ, సీనియర్ నాయకులు కేతూరి బుడ్డన్న, చిత్తారి ప్రభాకర్, ఏ సుమిత్రమ్మ, ఏ సీతారాములు, రామన్న గారి వెంకటేశ్వర్ రెడ్డి, బోయల రామ్మోహన్, అలివేలమ్మ, తిరుపతి సాగర్, బాలరాజు, జేబీ వెంకట్, సుబ్రహ్మణ్యం, దాసరాజు ప్రవీణ్, గంధం ప్రవీణ్, సూగురు రాములు, కొమ్ము శ్రీనివాసులు, మండ్ల రఘు, అరవింద్ నవీన్, విజయసాగర్, వెంకటేష్ నాయుడు, ఎర్ర రవి, పెద్ద మారు రాము తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News