Friday, September 12, 2025
ePaper
spot_img
Homeరాజకీయంతక్కువకాలంలోనే రేవంత్‌పై వ్యతిరేకత

తక్కువకాలంలోనే రేవంత్‌పై వ్యతిరేకత

  • భూముల కాపాడటంలో బీఆర్‌ఎస్‌ ఎంతో శ్రమించింది
  • రేవంత్‌కు పాలన చేతకావడం లేదు : ఎమెల్సీ కవిత

సీఎం రేవంత్‌ పాలన ఎవరికి అర్ధం కావడం లేదని.. ఇంత తక్కువ కాలంలో ప్రజావ్యతిరేకత కూడగట్టుకున్న సీఎం ఆయనే అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి దుశ్చర్య వల్ల హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ పడిపోయింది కాబట్టి 400 ఎకరాల భూమిని విక్రయించాలని నిర్ణయించారు అని ఆమె అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా 400 ఎకరాల భూమిని కాపాడింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అని ఆమె పేర్కొన్నారు. ఆ భూముల పరిరక్షణ కోసం కేసీఆర్‌ నిర్దేశం మేరకు న్యాయవాదులు కోర్టులో గట్టిగా వాదనలు వినిపించారన్నారు. ఇది యూనివర్సిటీ భూమి అని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళవద్దన్న ఉద్దేశంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం న్యాయ పోరాటం చేసిందని గుర్తుచేశారు. యూనివర్సిటీ నుంచి తీసుకున్న భూమిని యూనివర్సిటీకే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. 397 ఎకరాలను ఇతర చోట యూనివర్సిటీకి ఇచ్చామని ప్రభుత్వం వితండవాదం చేస్తుందని మండిపడ్డారు. పరిశ్రమల ఏర్పాటు, భూముల విక్రయం ఆ 397 ఎకరాల్లో చేసుకోవచ్చు కదా..? ప్రభుత్వం పర్యావరణం, ప్రకృతి కోణంలో కూడా ఆలోచించాలి అని కవిత సూచించారు. ఇప్పటికే కాంక్రీట్‌ జంగిల్‌ లాగా మారిన గచ్చిబౌలి ప్రాంతంలో ఈ 400 ఎకరాల్లో కూడా పెద్ద ఎత్తున కంపెనీలు ఏర్పాటు అయితే వాతావరణంపై ఎంత ఒత్తిడి పెరుగుతుందో ఆలోచించాలని కోరారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మై హోమ్‌ విహంగ నిర్మాణానికి భూములు కేటాయించామనడంలో వాస్తవం లేదన్నారు. మై హోమ్‌ విహంగా ప్రభుత్వ భూముల్లో నిర్మించినట్లయితే సీఎం రేవంత్‌ రెడ్డి బుల్డోజర్లను పంపించాలని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News