ఎన్నికల ముందు నువ్వే బాస్! గెలిచాక నీవు ఎవరు? మేనిఫెస్టో హామీలు ఇచ్చేది వాళ్లే, నమ్మాల్సింది మాత్రం ప్రజలే అమలు అసాధ్యం! ప్రతిపక్షలోఉన్నప్పుడు ‘‘ప్రజల సేవే మా ధ్యేయం’’అధికారంలో రాగానే ఆర్భాటాలు. పింఛన్ కార్డు కోసం బాధపడేది వృద్ధులు, కానీ ఎమ్మెల్యే కోసం ఎన్నిసార్లైన నామినేషన్ రెడీ.. అసెంబ్లీలో కుర్చీ కోసం యుద్ధం, బజార్లో కూరగాయల ధరలు, తదితర సమస్యల గురించో ఒక్క మాటా లేదు. ప్రజల ఓటు తీసుకునే నోరు అధికారంలో నోట్లు తింటూ బొద్దుగా మారి మాటరాదు!. అభివృద్ధిపేరుతో ఫోటోలు మారాయి, నేల మీద మాత్రం గోతులే మిగిలాయి. డ్రామా అంటే? టీవీలో కాదు, అసెంబ్లీలో!. అధికారం వచ్చాక జనం గుర్తుకేరారు, గుర్తొచ్చేది మరోఎన్నికే. పూటకోవాగ్దానం, ఐదేళ్లకోసందర్శన! చివరికి జనం ఓటేస్తారు. బాగుపడేది వాళ్లు బజారున పడేది ప్రజలు.. ఇది అప్రజాస్వామ్యం కాదా!
- మేదాజీ