Friday, February 20, 2026
Homeరంగారెడ్డిMissing | భార్య అదృశ్యం.. పోలీసులకు ఫిర్యాదు

Missing | భార్య అదృశ్యం.. పోలీసులకు ఫిర్యాదు

సిద్ధార్థ నగర్ దమ్మాయిగూడ ప్రాంతానికి చెందిన బాల జనక్ బిస్తా (35) తన భార్య కవిత బాల్ బిస్తా (23) అదృశ్యమైందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. వీరు నేపాల్ దేశానికి చెందిన వారు. గత కొద్ది కాలంగా జవహర్ నగర్ పరిధిలోని రామచంద్ర టవర్స్ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పని చేస్తూ నివసిస్తున్నారు.

బాల జనక్ బిస్తాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. 16-02న బాల జనక్ బిస్తా విధులకు వెళ్లిన సమయంలో సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో అతని భార్య కవిత బాల్ బిస్తా ఎవరికి తెలియజేయకుండా పిల్లలను ఇంట్లో వదిలి వెళ్లిపోయినట్లు సమాచారం. సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వచ్చిన బాల జనక్ బిస్తా పిల్లలు ఏడుస్తుండటాన్ని గమనించాడు.

- Advertisement -

భార్య గురించి పరిసర ప్రాంతాల్లో, బంధువుల వద్ద, పరిచయస్తుల వద్ద విచారించినా ఎటువంటి సమాచారం లభించలేదు. నేపాల్ లో ఉన్న తన బంధువులను ఫోన్ ద్వారా సంప్రదించినా ఆమె ఆచూకీ లభించలేదని తెలిపాడు.

దీంతో బాల జనక్ బిస్తా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కవిత బాల్ బిస్తా ఆచూకీపై సమాచారం ఉన్నవారు సమీప పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News