- వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి .
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి శుక్రవారం హైదరాబాదులో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. వనపర్తి నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటికీ తాను పూర్తిస్థాయిలో సహకరిస్తారని ముఖ్యమంత్రి తెలిపినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.
- Advertisement -
