గత సంవత్సరం కన్నా తగ్గిన నేరాల సంఖ్య
వార్షిక పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ డి.సునీతారెడ్డి
వనపర్తి ప్రతినిధి, డిసెంబర్ 24(ఆదాబ్ హైదరాబాద్): గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం నేరాలను అదుపు(Crimes Control) చేయడంలో వనపర్తి జిల్లా పోలీసులు(Wanaparty District Police) విజయం సాధించారాని జిల్లా ఎస్పీ డి.సునీతారెడ్డి(SP D.Sunitha Reddy) పేర్కొన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వనపర్తి జిల్లా పోలీసు వార్షిక పత్రికా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు(Thefts), రోడ్డు ప్రమాదాలు(Road Accidents), మహిళలపై దాడులు, చైన్ స్నాచింగ్(Chain snatching) వంటి నేరాలను నియంత్రించడంలో వనపర్తి జిల్లా పోలీస్ ముందున్నారని చెప్పారు. లోక్ అదాలత్ (Lok Adalat) ద్వారా 708 కేసులు పరిష్కరించడంలో వనపర్తి పోలీస్ సఫలీకృతం అయ్యారని, రాజీతోనే సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజల్లో అవగాహన పెంచారని తెలిపారు.
‘‘నేను సైతం కమ్యూనిటీ పోలీసింగ్’ కార్యక్రమంలో భాగంగా ప్రజల సహకారంతో వనపర్తి జిల్లాలో 2049 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాల నియంత్రణకు అడ్డుకట్ట వేశాం. మహిళల రక్షణకు, ఈవ్ టీజింగ్ నిరోధానికి ఏర్పాటుచేసిన షీ టీమ్‌లు 56 అవగాహన సదస్సులు నిర్వహించి 7500 మంది విద్యార్థులకు అవగాహన కల్పించి విద్యార్థుల్లో చైతన్యం తెచ్చారు. ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ ద్వారా 144 మంది బాల కార్మికులకు గుర్తించి బాలసదన్‌లో చేర్పించాం. జిల్లాలో ఇప్పటివరకు 1640 మిస్సింగ్ మొబైల్స్‌ను రికవరీ చేసి బాధితులకు అందించి పోలీసులపై ప్రజలకు నమ్మకం పెంచాం. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణిలో వచ్చిన 460 ఫిర్యాదుల్లో 324 ఫిర్యాదులను పరిష్కరించాం. మిగిలిన 136 ఫిర్యాదులను త్వరలోనే పరిష్కరిస్తాం. 2026లో ప్రజలందరికీ మంచి కలగాలని, స్నేహపూర్వక పోలీస్ విధానాన్ని అవలంభిస్తూ జిల్లా పోలీసులు బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో పారదర్శకంగా పనిచేస్తూ ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణ కోసం అనుక్షణం పనిచేస్తాం. అనంతరం.. జిల్లా పోలీస్ శాఖ తరపున ప్రజలకు, మీడియా ప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు’’ అని తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ నాయక్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, సీఐ కృష్ణయ్య, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అప్పల నాయుడు, వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.
