Homeరంగారెడ్డిCongress Leader | ఓట్ల చోరీ ప్రజాస్వామ్యానికి కరోనా లాంటి ప్రమాదకరం

Congress Leader | ఓట్ల చోరీ ప్రజాస్వామ్యానికి కరోనా లాంటి ప్రమాదకరం

మహేశ్వరం నియోజకవర్గం గుర్రం గూడ లోని ఏఐసీసీ, టీపీసీసీ, మాజీ ఎమ్మెల్యే మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి కిచ్చన్న లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్, పందుల వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో ఓట్ చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

Vote theft is as dangerous to democracy as Corona Pandula Venkat Goud 1

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… “ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, ఉన్న ఓట్లని తీసేసి లేని ఓట్లని చేర్చే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి జనాలని తీసుకొచ్చి ఎక్కడైతే ఎన్నికలు ఉంటాయో అక్కడ దొంగ ఓట్లను చేర్చుతున్నారు అని ఎద్దేవా చేశారు. కావున ఎన్నికల సంఘం మొత్తం బిజెపి కనుసన్నల్లో పనిచేస్తోంది.

- Advertisement -

మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భావించినప్పటికీ నాలుగు నెలల్లోనే ఒక కోటి దొంగ ఓట్లను చేర్చిన ఘనత బిజెపి పార్టీకి దక్కిందని అని డిసిసి వైస్ ప్రెసిడెంట్ వెంకట్ గౌడ్ విమర్శించడం జరిగింది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓట్ల దొంగతనం జరిగిందని లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదని రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యే వారిని అనడం జరిగింది.

రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా ప్రజలందరూ ఓట్ చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ ఉద్యమంలో భాగం కావాలి” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుర్రం గూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం లింగారెడ్డి, గుర్రంగూడ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు పందుల శివ గౌడ్, గుర్రం గూడా మహిళా అధ్యక్షురాలు ఐలమ్మ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎరుకల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు రమేష్ నాయక్, మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News