- జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి..
గ్రామస్థాయిలో ఎన్సీడీ స్క్రీనింగ్ ను మరింత బలోపేతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి వైద్య అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సమావేశం మందిరంలో అసంక్రమిక వ్యాధులు పై ఎన్ సి డి స్క్రీనింగ్ విధానంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశంఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి వైద్యాధికారులు, ఆయుష్మాన్ ఆరోగ్యం వైద్యాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. హైపర్ టెన్షన్, మధుమేహం రోగులను అనుసరించి అవసరమైన మందులను సకాలంలో పంపిణీ చేసి, వారి వివరాలను ఎన్సీడీ పోర్టల్ లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు.
జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి శ్రీనివాసులు మాట్లాడుతూ.. జిల్లాలో జరుగుతున్న డయాబెటిస్ రెట్టినోపతి స్క్రీనింగ్ కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో సమగ్ర ప్రణాళికతో నిర్వహించాలని సూచించారు. క్యాంపులో గుర్తించిన రెటినోపతి అనుమానితులను జిల్లా ఆసుపత్రికి పంపి అవసరమైన వారికి కంటి శాస్త్ర చికిత్సలు చేయించేలా కృషి చేయాలన్నారు.
జిల్లాలో అన్ని పాఠశాలలో పొగాకు మరియు వాటి ఉత్పత్తుల వినియోగం ద్వారా కలిగే ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ భాస్కర్ నాయక్, డాక్టర్ పరిమళ, జిల్లా ఎన్సిడి టీం సభ్యులు శ్రీనివాస్ కొండ, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
