Thursday, January 15, 2026
EPAPER
Homeఆదాబ్ ప్రత్యేకంNegligence | సీఎం ఆదేశాలు ‘డోంట్‌ కేర్‌’..

Negligence | సీఎం ఆదేశాలు ‘డోంట్‌ కేర్‌’..

  • వికారాబాద్‌లో అద్దె భవనంలోనే సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయం..
  • ప్రభుత్వ భవనాలు ఖాళీ, ప్రైవేట్‌ అద్దె భవనంలో సబ్‌ రిజిస్టర్‌..
  • సీఎం, సీఎస్‌ ఆదేశాలకు చిల్లు పెట్టిన వికారాబాద్‌ సబ్‌ రిజిస్టర్‌
  • సీఎం ఆదేశాల అమలులో నిర్లక్ష్యం
  • ఖాళీగా ప్రభుత్వ భవనాలు.. జిల్లా అధికారుల నిర్లక్ష్యం
  • ఆడిరది ఆట.. పాడిరదే పాట.. సబ్‌ రిజిస్టర్‌పై సీఎం ఆదేశాలు వర్తించవా
  • సీఎం ఆదేశాలు ఫైళ్లకేనా పరిమితమ..?
  • ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను పక్కనపెట్టి వేల రూపాయల అద్దె చెల్లింపులు
  • సీఎం, సీఎస్‌ స్పష్టమైన ఆదేశాలపై జిల్లా అధికారుల నిర్లక్ష్యం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి 2025 డిసెంబర్‌ 26న కీలక ఆదేశాలు జారీ చేశారు.ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై ప్రైవేట్‌ అద్దె భవనాల్లో కొనసాగకూడదని, అద్దె భవనాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను తక్షణమే ఖాళీ చేయాలని సీఎం స్పష్టం చేశారు.ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నప్పటికీ అద్దె భవనాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ నిధులు వృథ చేయడం సరికాదని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ మేరకు డిసెంబర్‌ 23 నుంచి అమలు చేసే లా డెడ్‌లైన్‌ విధించారు.

సీఎం, సీఎస్‌ ఆదేశాలను లెక్కచేయని వికారా బాద్‌ సబ్‌ రిజిస్టర్‌ వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయం గత కొన్ని సంవత్సరాలుగా ఆర్డీవో కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రైవేట్‌ అద్దె భవనంలోనే కొనసాగుతోంది. అయితే జిల్లా కేంద్రం లోనే ప్రభుత్వానికి చెందిన అనేక భవనాలు నిరుపయోగంగా ఖాళీగా ఉన్నప్పటికీ, వాటిని వినియోగంలోకి తీసుకోకుండా అద్దె భవనంలోనే కార్యాలయం కొనసాగించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

- Advertisement -

ఆర్డీవో కార్యాలయంలో సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయానికి సరిపడే భవనం ఉన్న ప్పటికీ, అక్కడ ఏర్పాటు చేయకుండా వేల రూపాయల అద్దె చెల్లిస్తూ ప్రైవేట్‌ భవనంలోనే కొనసాగించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక వికారాబాద్‌ పట్టణంలో ఎంపీడీవో కార్యాలయం పక్కనే మూడు ప్రభుత్వ భవనాలు పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ భవనాలను పక్కనపెట్టి ప్రైవేట్‌ భవనంలో సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయాన్ని కొనసాగించడంపై పట్టణ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా అధికారుల నిర్లక్ష్యమేనా..?

సీఎం, సీఎస్‌ స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోని సబ్‌ రిజిస్టర్‌పై జిల్లా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.ప్రభుత్వ కార్యాలయాల కోసం అవసరమైన భవనాలు ఖాళీగా ఉన్నా, వాటికి కనీస మరమ్మతులు కూడా చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న జిల్లా అధికారుల వైఖరిపై వికారాబాద్‌ జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిర్లక్ష్యపు అధికారులతో జిల్లా అభివృద్ధి ఎలా సాధ్యం..?

జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉండగా,కనీసం రివ్యూ మీటింగ్‌లు, ప్రజా సలహాలు, విద్యావంతుల సూచనలు కూడా తీసుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఇలా చిన్నచిన్న అంశాలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వంపై మరింత ఆర్థిక భారం పడే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర సీఎస్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే.

వికారాబాద్‌ సబ్‌ రిజిస్టర్‌ మహేందర్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్యాలయాలు ఉండకూడదు అని ఆదేశాలు జారీ చేసినప్పటి నుండి సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయం కోసం వికారాబాద్‌ పట్ట ణంలో ప్రభుత్వ భవనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. అని వివరాలు సేక రించి రిజిస్ట్రేషన్‌కు సరిపడా కార్యాలయాన్ని అలర్ట్‌ చేయాలని వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌కి రిక్వెస్ట్‌ లెటర్‌ ఇచ్చినట్టు సబ్‌రిజిస్టర్‌ మహేందర్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News