Tuesday, March 3, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంమైనింగ్‌ మాపియాతో అధికార యంత్రాంగం రహస్య ఒప్పందం..

మైనింగ్‌ మాపియాతో అధికార యంత్రాంగం రహస్య ఒప్పందం..

  • భూమాత గుండెల్లో బుల్డోజర్ల గుణుపాలు
  • హడలెత్తుతున్న పల్లెటూరు ప్రజలు
  • పట్టా భూమిని చూపి పర్మిషన్‌ దృవపత్రం
  • 100 ఎకరాలు ప్రభుత్వ భూమిని తవ్వి అక్రమ వ్యాపారం
  • మైనింగ్‌ అధికారులతో సుద్దవ్యాపారుల ములాఖత్‌
  • దాదాపు 400 కోట్ల కుభకోణం..
  • కలెక్టర్‌ సాబ్‌ కు ఇది కనపడ లేదా..?

పంచభూతాలు… ప్రాణకోటి జీవరాసులకు ఆధారమని ప్రతి నాయకుడు, అధికారులు వేదికలపై ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి సామాన్యులను మెప్పిస్తారు. పంచభూతాల్లో ప్రధానమైన వాటిలో ఒకటి భూమి… పెరుగుతున్న జనాభాకు, మనిషి మనుగడకు అవసరాల కోసం సహజసిద్ధంగా లభించే వనరులు భూమినుండే వాడుకుంటాము.. కానీ తీపి ఎక్కువైతే అది విషంగా మారుతుంది అని అందరికి తెలిసికూడాను అదే తప్పిదం చేసి ప్రళయానికి దారులు తెరిచిన సంఘటన వికారాబాద్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా, యదేచ్చగా కొనసాగుతున్న సంఘటనల వివరాలు ఇలా ఉన్నాయి.

అక్రమ సుద్ద వ్యాపారాలు.. ప్రభుత్వ యంత్రాంగంతో రహస్య ఒప్పందం కుదుర్చు కున్నందుకే ప్రభత్వానికి సంబంధించిన 100 ఎకరాలు భూమిని తవ్వి అమ్ముకుని సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌ గా ఉన్న ఈ శాఖలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక దారూరు మండలంలోనే ఇంత పెద్ద చీకటి దందా జరిగితే ఇక జిల్లా పరిధిలో నాపరాతి, సుద్ద, ఎర్రమట్టి, నల్లరాళ్ల కంకర, ఇసుక దందాల్లో ఎన్ని అక్రమాలు జరిగి ఉంటాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు..

- Advertisement -

దారూరు మండల్‌ రెవెన్యూ అధికారుల అండదండలతో ఇష్టారాజ్యాంగా అక్రమ మైనింగ్‌ జరుగుతుందని. మండల పరిధిలో తరిగోపుల గ్రామ పంచాయతీ పరిధిలో 384, సర్వే నెంబర్‌ తో పాటు మరి కొన్ని సర్వే నంబర్లకు గ్రామ పరిధిలో సుమారు 20 ఎకరాల భూమికి పర్మిషన్లు నామమాత్రంగా తీసుకొని కొన్ని నెలల క్రితం తరిగోపుల గ్రామ రెవెన్యూ పరిధిలో మైనింగ్‌ ప్రారంభించారు. ప్రభుత్వ భూమి లావణి పట్టా భూములకి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు.

కానీ మైనింగ్‌ అధికారులు డబ్బుకు ఆశపడి పర్మిషన్‌ ఇవ్వడంతో ధరూర్‌ మండల రెవెన్యూ అధికారులు ప్రజా అభిప్రాయ సేకరణ చేయకుండా ప్రభుత్వ భూములకి మైనింగ్‌ చేసేందుకు ఓరల్‌ పర్మిషన్‌ ఇచ్చేశారు. కోట్ల విలువచేసే శుద్ధ గనులకి అక్రమ మైనింగ్‌ చేసే మైనింగ్‌ మాఫియాతో చేతులు కలిపి, ప్రభుత్వ ఆదాయానికి అధికారులు ఇలా గండి కొడుతున్నారని ఆయా గ్రామాలకు చెందిన యువకులు ప్రభుత్వాని తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

20 ఎకరాలకి మైనింగ్‌ పేరుతో నామమాత్రంగా అనుమతులు :

దారూర్‌ మండల్‌ తరిగొపల గ్రామంలో సర్వే నెంబర్‌ 384 నామమాత్రంగా అనుమతులు పొంది.. పక్కన ఉన్న 100 ఎకరాలకు పైగా వేరే భూములలో మైనింగ్‌ ప్రారంభించినట్టు తెలిసింది.. రాత్రి వేళల్లో మైనింగ్‌ తవ్వకాలు జరుగుతున్న సమయంలో డ్రిల్లింగ్‌, జేసిబి, హిటాచి యంత్రాలు దారుణంగా శబ్దాలు చేస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు నిద్రలేకుండా పోతోందని, కేరెల్లి, కొండాపూర్‌, బాచారం తరిగోపుల, గ్రామ ప్రజలు వాపోతున్నారు. పర్యావరణం పెద్ద మొత్తంలో దెబ్బతిన్నప్పటికీ, చుట్టుపక్కల రైతుల పంట పొలాలకి నష్టం వాటిల్లుతున్నప్పటికీ ప్రజాభిప్రాయం సేకరణ చేయకుండానే రెవెన్యూ, మైనింగ్‌, అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారనేదే అర్ధం కాని ప్రశ్న..

మైనింగ్‌ పర్మిషన్‌ ఇచ్చేటప్పుడు అధికారులకు లక్షల్లో ముడుపులు ముట్టినట్లు ఆ గ్రామాల ప్రజలు, యువకులు చర్చించు కుంటున్నారు. లక్షల రూపాయలు తీసుకొని ఆక్రమంగా మైనింగ్‌ చేసేందుకు అనుమతులు ఇచ్చిన అధికారులపై ఎలాంటి చర్యలు ఉంటాయో వేచి చూడాలి.

పర్యావరణం దెబ్బతింటుంది :

మైనింగ్‌ అనుమతుల్లో జిల్లా కమిటీ ఉంటుంది. జిల్లా కలెక్టర్‌, ఫారెస్ట్‌ అధికారి, డిఆర్డిఓ, నీటి పారుదల శాఖ, ఫైర్‌ సేఫ్టీతో పాటు కొంతమంది అధికారులతో మైనింగ్‌ జిల్లా అధికారితో ఒక కమిటీ ఉంటుంది. వందల కోట్ల రూపాయల అక్రమ మైనింగ్‌ జరుగుతుంటే జిల్లాలో ఉండే ఈ కమిటీ సభ్యుల వాటా ఎంత ఉంటుందో..? అని యువత సూటిగా ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకుండా, జిల్లా కమిటీ సభ్యులకు ఎన్ని లక్షల్లో ముడుపులు ముట్టాయో తెలియాల్సి ఉంది.

కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని ఇలా అక్రమాలకు పాల్పడు తున్న వారికి జిల్లాలో అన్ని శాఖల అధికారులు సహకరిస్తున్నారని చర్చ కొనసాగుతుంది. ఇప్పటికైనా వికారాబాద్‌ జిల్లా మైనింగ్‌ చైర్మన్‌, జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. సుమారు లక్ష మెట్రిక్‌ టన్నుల సుద్ద మైనింగ్‌ జరుగుతు ఉంటే.. జిల్లా మైనింగ్‌ కమిటీ సభ్యులకు తెలియకుండా జరుగుతుందా? అనే చర్చ జిల్లాలో కొనసాగుతుంది. ఇంత భారీగా శుద్ధ ఆక్రమ మైనింగ్‌ వల్ల జిల్లాలో పర్యావరణం దెబ్బతింటుందని పలువురు వాపోతున్నారు.

భారీ శబ్దాలకు కూడుకపోతున్న బోరు బావులు :

శుద్ధ మైనింగ్‌ నందు డ్రిల్‌ చేసేటప్పుడు చుట్టుపక్క పంట పొలాల్లో ఉన్న బోరు బావుల్లో మట్టి కూడుకు పోతుంది అని రైతులు వాపోతున్నారు. భారీ శబ్దాలతో భూగర్భ జలాలకి నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, అక్రమార్కులపై చట్టపరమైన చర్య తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News