- జిల్లా ఎస్పీ డి సునిత రెడ్డి..
ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిషేధమని జిల్లా ఎస్పీ డి సునీత రెడ్డి వెల్లడించారు. గురువారం ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు మూడు దశల పంచాయతీ ఎన్నికల పూర్తిస్థాయి ప్రక్రియకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోనే కొనసాగుతుందని ఎస్పి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని శాంతియుత వాతావరణానికి ప్రజలు, నాయకులు, అభ్యర్థులు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని, లేనిపక్షంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
- Advertisement -
