- వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు ప్రారంభం
- భీమేశ్వరాలయంలో దర్శనాల కోసం ఏర్పాట్లు
- ముందస్తు ప్రకటన లేకుండా దర్శనాలు నిలిపివేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు
ఆలయ విస్తరణ పనులు కొనసాగుతుండడంతో వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం లో భక్తుల దర్శనాలను తాత్కలికంగా నిలిపివేశారు. ఆలయ అధికారులు ముందస్తు ప్రకటన లేకుండా దర్శనాలు నిలిపివేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయం ఎదుట స్వామివారి దర్శనం కోసం బుధవారం తెల్లవారుజామున భక్తులు నిరీక్షించారు. ఆలయ ప్రధాన గేటుకు కూడా అధికారులు తాళం వేయడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన గేటు నుంచి ఆలయం లోపలికి వెళ్లకుండా అడ్డంగా రేకులు ఏర్పాటు చేశారు అధికారులు.

ఈ నేపథ్యంలో భక్తులు ఆలయం ఎదుట ఆందోళనకు దిగారు. అయితే, రాజన్న ఆలయం ఎదుట ప్రచార రథంపై స్వామివారి దర్శనం కల్పించారు. ఎస్ఈడీ తెరపై స్వామివారి దర్శనం భక్తులకు కల్పించేలా ఏర్పాట్లు చేశారు. ఆలయ విస్తరణలో భాగంగా ఇప్పటికే భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. రాజరాజేశ్వరస్వామి స్వామి ఆలయ అధికారులు. ఎంతో దూరం నుంచి వచ్చి స్వామివారికి మొక్కు చెల్లిందమని వస్తే ఆలయ అధికారులు ఇలా చేయడం భావ్యం కాదని భక్తులు మండిపడుతున్నారు. ఇంత చలిలోనూ స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నామని.. అయినా అధికారులు కనికరించడం లేదని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
