Homeరంగారెడ్డిShadnagar MLA | కలిసిమెలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యం.

Shadnagar MLA | కలిసిమెలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యం.

  • ఎమ్మెల్యే, ఓబీసీ సెల్ చైర్మన్ ,ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్
  • అప్పారెడ్డిగూడలో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభం.
  • స్థల దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే.

ఎన్నికల్లో గెలిచిన,ఓడిన వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటేనే గ్రామాభివృద్ధి సులువుగా సాధ్యం అవుతుందని షాద్ నగర్ ఎమ్మెల్యే, ఓబీసీ సెల్ చైర్మన్ ,ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. నందిగామ మండలం అప్పారెడ్డిగూడ గ్రామంలో ఎస్డిఎఫ్ నిధులు రూ.25 లక్షల నిధులతో నిర్మించిన గ్రామపంచాయతీ నూతన భవనాన్ని బుధవారం ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా హాజరై, వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, అందరూ కలిసిమెలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు.కలిసుంటే నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని పాలకవర్గానికి,కార్యకర్తలకు సూచించారు. కోట్ల రూపాయలు ధర పలికే భూమిని గ్రామాభివృద్ధి కోసం, మహిళా సమైక్య భవనానికి స్థలానికి కేటాయించిన కీర్తిశేషులు సరోజనమ్మ దేవికి, పంచాయతీ భవనానికి స్థలం కేటాయించిన మాజీ ఎమ్మెల్సీ కీర్తిశేషులు రాందేవ్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
Veerlapalli Shankar Inaugurates Appareddyguda Gram Panchayat Building

వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిన్నంతరగారి మల్లేష్, ఉపసర్పంచ్ ప్రభు, పంచాయతీ కార్యదర్శి నరేష్, కాంగ్రెస్ నేతలు రవీందర్ రెడ్డి,లక్ష్మారెడ్డి, జంగ నరసింహులు,పసుల బుచ్చయ్య,సత్యనారాయణ గౌడ్,భగవాన్ దాస్,మాజీ ఎంపీటీసీలు చంద్రశేఖర్ గౌడ్,చంద్రపాల్ రెడ్డి,కుమార్ గౌడ్,మాణిక్యం, మంగలి ప్రభాకర్,సీతారాం,సట్టి నవాజ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి,సురేష్,సిద్దాపూర్ శేఖర్ రెడ్డి, చిన్నంతర గారి కృష్ణ,ఆటో కృష్ణ,చిందం నర్సింహా,గడ్డం జంగయ్య,చీకుర్తి సుదర్శన్,బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News