Homeవరంగల్‌Urea | యూరియా కొరత తీర్చలేని ప్రజా ప్రభుత్వం.

Urea | యూరియా కొరత తీర్చలేని ప్రజా ప్రభుత్వం.

  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు.

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల యూరియా కొరత మాత్రం తీర్చలేక పోతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతులు శనివారం ఉదయం నాలుగు గంటల నుండి చలిలో గజగజ వణుకుతూ పురుషులు, మహిళలు ఆధార్ కార్డు పట్టుకొని లైన్ లో నిలబడి ప్రజా ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పత్తి పంట అనంతరం ఆ పంటను తొలగించి భారీ ఎత్తున మొక్కజొన్న సాగు చేస్తున్నందున మండల వ్యాప్తంగా ఎన్ని ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారో, చేస్తున్నారో సంబంధిత వ్యవసాయ శాఖ వారు గుర్తించి యూరియా కొరత లేకుండా చూడవలసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం పై ఉంది. లేనిచో రానున్న ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు.

Urea Shortage Sparks Farmers Anger in Warangal
- Advertisement -
RELATED ARTICLES

Latest News