Friday, March 6, 2026
Homeమెదక్‌Ponnam Prabhakar | వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

Ponnam Prabhakar | వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

ధాన్యం కొట్టుకుపోయిన రైతుకు రూ.10 వేలు తక్షణ సాయం

మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు(Tour of flood affected areas). హుస్నాబాద్ (Husnabad) నియోజకవర్గంలోని కోహెడ మండలం బస్వాపూర్ పోరెడ్డిపల్లిలో వరద ఉధృతికి తెగిపోయిన రోడ్ల(Roads)ను పరిశీలించారు. కొట్టుకుపోయిన కల్వర్టులను పరిశీలించి బస్వాపూర్ అక్కెనపల్లి మధ్య వెళ్ళే బ్రిడ్జి (Bridge) వద్ద మోయ తుమ్మెద వాగును చూశారు.

- Advertisement -

రోడ్లపై ఆరబోసిన వడ్లు వరదకు మొత్తం కొట్టుకుపోయిన ప్రాంతాలను, వరదలతో ముంపులోనే ఉన్న దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించి ఆవేదన చెందుతున్న రైతుల(Farmers)తో మాట్లాడారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. దెబ్బతిన్న రోడ్లను, కల్వర్టులను, పంటలను అధికారులు మొత్తం రికార్డు చేయాలని ఆదేశించారు.

అనంతరం హుస్నాబాద్ మార్కెట్ యార్డును పరిశీలించారు. పై నుంచి వచ్చిన వరదతో నీటిలో మునిగిన మార్కెట్ యార్డులోని వరి ధాన్యాన్ని చూశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం మార్కెట్ లో ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షానికి మార్కెట్లో ఉన్న తన ధాన్యం పూర్తిగా కొట్టుకుపోయిందని కన్నీటి పర్యంతమైన రైతు వీరవ్వకు తక్షణ సహాయం(Immediate help) కింద 10 వేల రూపాయలు అందించారు. మార్కెట్ యార్డు(Market Yard)లో ఉన్న మొక్కజొన్న పూర్తిగా కొనుగోలు చేయాలని మార్క్ ఫెడ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News