అధిరా టాకీస్ బ్యానర్‌పై 100కు పైగా సినిమాలకు పని చేసిన సినిటారియ మీడియా వర్క్స్ సపోర్టుతో శ్రీనివాస్ (బుజ్జి) దర్శకత్వంలో నరేన్ తేజ్, సుహాన జంటగా నటిస్తూ మురళీకృష్ణ వర్మ సినిమాటోగ్రాఫర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం వైఫ్. సత్య కాశ్యప్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి నందమూరి హరి (Nandamuri Hari) ఎడిటింగ్ చేశారు. ప్రముఖ దర్శకుల ఆధ్వర్యంలో వైఫ్ చిత్ర టైటిల్(Title), ఫస్ట్ లుక్ (First Look) లాంఛ్ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖ దర్శకుడు చంద్ర మహేష్ (Director Chandra Mahesh) మాట్లాడుతూ.. “అటు భర్తకు ఇటు కుటుంబానికి బలంగా, పునాదిలా నిలబడే వైఫ్ టైటిల్ ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఈ సినిమాకు పని చేసిన అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

డైరెక్టర్ సముద్ర మాట్లాడుతూ.. “అందరి జీవితాల్లో వైఫ్ ఉంటారు. ఆ వైఫ్‌ను టైటిల్‌గా పెట్టారు. ఈ సినిమా కోసం ఎంతో మంది ప్రతిభవంతులు పనిచేస్తున్నారు. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. “ఈ సినిమాకు బలం సినిటారియ మీడియా వర్క్స్ వెంకట్. కే మ్యూజిక్ ఈ సినిమా పాటలు కొనడం విశేషం. మంచి సినిమాలు ప్రేక్షకులకు చేరదీసే మాధ్యమం పబ్లిసిటీ. ఈ కార్యక్రమానికి విచ్చేసి సినిమాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దర్శకుడు బుజ్జికి అభినందనలు” అన్నారు.
దర్శకుడు శ్రీనివాస్ (బుజ్జి) మాట్లాడుతూ.. “ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. క్రైమ్ & సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లలో రాబోతుంది. దీనికి పనిచేసిన ప్రతిఒక్కరికి నా ధన్యవాదాలు. త్వరలో మరొక షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నాం. మీడియా మా సినిమాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

సినిటారియ మీడియా వర్క్స్ సీఈఓ వెంకట్ మాట్లాడుతూ.. “ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా కృతజ్ఞతలు. నేటి జనరేషన్‌కు తగ్గట్లు ఈ సినిమా ఉండబోతుంది” అన్నారు.
హీరోయిన్ సుహాన (Heroine Suhana) మాట్లాడుతూ.. “మా సినిమా వైఫ్ మంచి సస్పెన్స్ థ్రిల్లర్. ఇందులో నా పాత్ర ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని మరో షెడ్యూల్ త్వరలో ప్రారంభించిపోతున్నాం. మా సినిమాకు మీరంతా సపోర్ట్ చేసి మంచి విజయం అందిస్తారని కోరుకుంటున్నా” అన్నారు.
హీరో నరేన్ తేజ్ మాట్లాడుతూ.. “ఎంతో ఫ్యాషన్‌తో ఐటీ రంగాన్ని వదిలేసి సినీ రంగంలోకి వచ్చాను. చక్కని కథతో మా దర్శకులు బుజ్జి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాం. ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులు అందరికీ పేరుపేరునా నా కృతజ్ఞతలు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకుంటున్నా” అన్నారు.
డీఓపీ మురళీకృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ కాశ్యప్, కె.మ్యూజిక్ ప్రియాంక తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
